IPL 2021: ఎలిమినేటర్ మ్యాచ్‌కి ముందు ఆర్‌సీబీకి షాక్... ఆ ఇద్దరు ప్లేయర్లు అవుట్..

First Published Oct 11, 2021, 4:29 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌కి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇద్దరు కీ ప్లేయర్లను కోల్పోవాల్సి వచ్చింది.. టీమిండియాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండ్ షో చూపించిన ఆకట్టుకున్న శ్రీలంక ప్లేయర్ వానిందు హసరంగ, లంక బౌలర్ చమీరా, ఆర్‌సీబీ జట్టును వీడారు...

ఇండియా, శ్రీలంక మధ్య జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో ఆకట్టుకనే ప్రదర్శన ఇచ్చిన వానిందు హసరంగను ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానంలో రిప్లేస్‌మెంట్‌గా తీసుకొచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

అతనితో పాటు లంక పేసర్ దుస్మంత ఛమీరాను ఆసీస్ ఆల్‌రౌండర్ కేన్ రిచర్డ్‌సన్ స్థానంలో జట్టులోకి తీసుకుంది... ఈ ఇద్దరూ ఫేజ్ 2లో ఆర్‌సీబీతో కలిసారు...

భారీ అంచనాలతో రెండు మ్యాచులు ఆడిన వానిందు హసరంగ, 6 ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్లేమీ తీయలేకపోయాడు. అదీకాక 10 ఎకానమీతో పరుగులు సమర్పించాడు. బ్యాటింగ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు...

అలాగే దుస్మంత ఛమీరాను జట్టులోకి తీసుకున్నప్పటికీ అతనికి ఇప్పటిదాకా ఒక్క అవకాశం కూడా రాలేదు. సిరాజ్, చాహాల్,హర్షల్ పటేల్ వంటి ప్లేయర్లు రాణిస్తుండడంతో ఛమీరాని ఆడించే అవసరం రాలేదు...

అయితే కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌కి ముందు ఇద్దరు శ్రీలంక ప్లేయర్లు హసరంగ, ఛమీరా... ఆర్‌సీబీ జట్టును వీడుతున్నారు...

యూఏఈలో జరిగే టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ కోసం లంక బోర్డు ఏర్పాటు చేసిన క్యాంపులో కలిసేందుకు ఆర్‌సీబీ బయో బబుల్ నుంచి ఈ ఇద్దరినీ విడుదల చేసినట్టు ప్రకటించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

టీ20 వరల్డ్‌కప్ సూపర్12 రౌండ్‌కి అర్హత సాధించలేకపోయిన శ్రీలంక జట్టు, గ్రూప్ స్టేజ్‌లో నమీబియా, ఐర్లాండ్, నెదర్లాండ్ వంటి జట్లతో మ్యాచులు ఆడనుంది...

అక్టోబర్ 18న నమీబియాతో జరిగే మొదటి మ్యాచ్‌కి ముందు 12, 14 తేదీల్లో రెండు వార్మప్ మ్యాచులు కూడా ఆడబోతోంది శ్రీలంక జట్టు... గ్రూప్ స్టేజ్‌లో టాప్ 2లో నిలిచిన జట్లు, సూపర్ 12కి అర్హత సాధిస్తాయి..

అలాగే కేకేఆర్ ప్లేయర్ షకీబుల్ హసన్ కూడా ఎలిమినేటర్ మ్యాచ్‌లో అందుబాటులో ఉండడం లేదు. బంగ్లాదేశ్ జట్టు కూడా గ్రూప్ స్టేజ్‌లో పోటీపడుతుండడంతో తన జట్టు క్యాంప్‌లో కలిశాడు షకీబుల్ హసన్...

click me!