IPL2021: గౌతమ్ గంభీర్ తర్వాత ధోనీ కెప్టెన్సీలోనే బాగుంది... రాబిన్ ఊతప్ప కామెంట్స్...

First Published Oct 11, 2021, 4:05 PM IST

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్లలో రాబిన్ ఊతప్ప ఒకడు. ఐపీఎల్ కెరీర్‌లో 4691 పరుగులు చేసిన రాబిన్‌ ఊతప్పకి నిలకడలేమి కారణంగా రావాల్సినంత క్రేజ్ మాత్రం రాలేదు... ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి క్వాలిఫైయర్‌లో మరోసారి తన మార్క్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు రాబిన్...

గాయంతో బాధపడుతున్న సురేష్ రైనా స్థానంలో జట్టులోకి వచ్చిన రాబిన్ ఊతప్ప, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టూ డౌన్‌లో వచ్చి 6 బంతులాడి 2 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు..

అయితే మొదటి క్వాలిఫైయర్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన రాబిన్ ఊతప్ప, 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేసి అదరగొట్టాడు...

పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ బౌలర్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 20 పరుగులు రాబట్టిన రాబిన్ ఊతప్ప, అశ్విన్, అక్షర్ పటేల్... ఇలా బౌలర్లు ఎవరనేది పట్టించుకోకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు...

2008 నుంచి ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పూణె వారియర్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లకి ఆడిన రాబిన్ ఊతప్పకి సీఎస్‌కే ఆరో ఫ్రాంఛైజీ...

ఇందులో అత్యధికంగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున 2014 నుంచి 2019 వరకూ ఆడిన రాబిన్ ఊతప్ప, గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్‌కి కీలక బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు...

‘గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్‌కి చాలా ఎంజాయ్ చేసేవాడు. గౌతీ ఉన్నప్పుడు ఎంతో సేఫ్‌గా అనిపించేది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ జట్టులో నాకు అలాంటి ఫీలింగ్ కలిగింది...

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ప్రతీ ఆటగాడిని టీమ్ మేనేజ్‌మెంట్ ఎంతగానో నమ్ముతుంది. అదే ఫ్రాంఛైజీ కోసం మరింత చేయాలనే ఆలోచనను ప్లేయర్లలో నింపుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు రాబిన్ ఊతప్ప...

2014 సీజన్‌లో 660 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు.. 

click me!