IPL 2021: ఆడి గెలిపించిందేమో వాళ్లు, క్రెడిట్ మొత్తం మాహీకా... ధోనీ నీకిది తగునా...

First Published Oct 11, 2021, 3:18 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ ఫైనల్‌కి చేరింది. క్వాలిఫైయర్ 1లో ఢిల్లీ క్యాపిటిల్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి, 9వ సారి ఫైనల్‌లోకి ప్రవేశించింది సీఎస్‌కే... ఈ విజయంతో మాహీపై మరోసారి ప్రశంసల వర్షం కురుస్తోంది...

ఈ సీజన్‌లో పెద్దగా ఫామ్‌లో లేని మహేంద్ర సింగ్ ధోనీ, మొదటి క్వాలిఫైయర్‌లో కీలక సమయంలో బ్యాటుతో అదరగొట్టి... సీఎస్‌కేని ఫైనల్ చేర్చాడు...
(photo source- iplt20.com)

మాహీ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా అప్పటిదాకా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ కాస్తా, వన్‌సైడ్ వార్‌గా మారిపోయింది...

ఫినిషర్ రోల్ పోషిస్తూ, ఆఖర్లో కొన్ని మెరుపులు మెరిపించిన మహేంద్ర సింగ్ ధోనీని ఆకాశానికెత్తేస్తూ ప్రశంసల వర్షం కురుస్తోంది...

అయితే ధోనీ ఒంటి చేత్తో ఈ విజయాన్ని అందించలేదు. దానికి ముందు రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్ విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు...

వన్‌డౌన్‌లో వచ్చిన రాబిన్ ఊతప్ప, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 20 పరుగులు రాబట్టాడు. 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేసి అదరగొట్టాడు...

ఈ సీజన్‌లో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి రెండో వికెట్‌కి 110 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు రాబిన్ ఊతప్ప...

50 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్... గత రెండు సీజన్లలో ఏడోసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు...

అయితే ఈ ఇద్దరి ఇన్నింగ్స్‌లు మాహీ ఆఖర్లో ఆడిన నాలుగంటే నాలుగు షాట్స్ కారణంగా తెరమరుగైపోయాయని, మ్యాచ్ మొత్తాన్ని ధోనీయే ఒంటిచేత్తో గెలిపించినట్టుగా పొగిడేస్తున్నారని అంటున్నారు ఫ్యాన్స్...

వన్డే వరల్డ్‌కప్‌లో గంభీర్, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మించి విజయం దాకా చేరేస్తే ఆఖర్లో హెలికాఫ్టర్ షాట్ కొట్టి క్రెడిట్ అంతా కొట్టేసినట్టు, మరోసారి క్రెడిట్ అంతా మాహీ ఖాతాలోకి వెళ్లిందంటూ బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు...

మాహీ క్రీజులోకి వచ్చే సమయానికి సీఎస్‌కే విజయానికి 12 బంతుల్లో 24 పరుగులు కావాలి. ఇందులో ఓ బౌండరీ, సింగిల్ తీసి మొయిన్ ఆలీ అవుట్ అయ్యాడు...

ఇంకా విజయానికి 9 బంతుల్లో 19 పరుగులు కావాల్సిన దశలో మాహీ ఆడిన 6 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేశాడు. ఓ పరుగు వైడ్ రూపంలో వచ్చింది...

అలాంటి ఇన్నింగ్స్ కారణంగానే సీఎస్‌కే గెలిచిందని క్రిడిట్ మొత్తం అతనికే ఇచ్చేయడం ఎంతవరకూ న్యాయమంటున్నారు కొందరు ధోనీ యాంటీ ఫ్యాన్స్...

అప్పటికే విజయం అంచుల దాకా వచ్చిన మ్యాచ్‌ను జడేజా ఫినిష్ చేసేవాడు. అతనున్న ఫామ్‌కి నాలుగు సిక్సర్లు బాది ఖేల్ ఖతమ్ చేసేవాడు కూడా...

అయితే పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న ధోనీ, కావాలని క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికే జడ్డూని పంపకుండా తానే బ్యాటింగ్‌కి వచ్చాడని ట్రోల్ చేస్తున్నారు...

హేటర్స్ ఎన్ని రకాల విమర్శలు చేసినా ఎన్నో ఏళ్లుగా మాహీ నుంచి సరైన ఇన్నింగ్స్ చూడలేకపోయిన ధోనీ ఫ్యాన్స్‌కి ఈ మెరుపులే కాస్త ఆకలి తీర్చాయి...

మాహీ ఎంత కొట్టాడనేది కాకుండా, ఎలా కొట్టాడనేది ముఖ్యమంటున్నారు ఆయన అభిమానులు... ధోనీని ఇలా చూస్తే, ఏదో తెలియని సంతృప్తి కలిగిందని కామెంట్లు చేస్తున్నారు...

click me!