ఫస్టాఫ్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లతో 37 పరుగులు రాబట్టి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు రవీంద్ర జడేజా... పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్న హర్షల్ పటేల్ ఓవర్‌లో సిక్సర్ల మోత మోగించాడు...
సెకండాఫ్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 22 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పేశాడు...
విజయానికి 12 బంతుల్లో 27 పరుగులు కావాల్సిన దశలో గెలుపు ఆశలు పెట్టుకున్న కేకేఆర్, రవీంద్ర జడేజా వీరబాదుడు కారణంగా మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చింది...
బౌలింగ్‌లో ఓ వికెట్ తీసిన జడేజా, 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 22 పరుగులు చేసి సీఎస్‌కేకి విజయాన్ని అందించి... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు...
ఇంటర్నేషనల్ డాటర్స్ డే రోజున జరిగిన ఈ మ్యాచ్ అనంతరం తన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును తన కూతురికి అంకితమిస్తున్నట్టు ప్రకటించాడు రవీంద్ర జడేజా...
‘ఇది నీ కోసం నిద్యానా... హ్యాపీ డాటర్స్ డే’ అంటూ కాప్షన్ ఇచ్చాడు రవీంద్ర జడేజా. సీఎస్‌కే ఈ ఫోటోను పోస్టు చేసి... ‘ది పర్ఫెక్ట్ గిఫ్ట్’ అంటూ కాప్షన్ ఇచ్చింది...