ఈ కుర్రాడి బౌలింగ్ చూస్తుంటే, ఆ పాక్ బౌలర్ గుర్తుకొస్తున్నాడు... ఉమ్రాన్ మాలిక్‌పై శ్రీకాంత్ కామెంట్స్...

Published : Oct 05, 2021, 05:39 PM ISTUpdated : Oct 05, 2021, 05:55 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉమ్రాన్ మాలిక్... మొదటి ఓవర్‌‌లోనే 150+ కి.మీ.ల వేగంతో బంతులు వేసిన ఉమ్రాన్ మాలిక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది...

PREV
16
ఈ కుర్రాడి బౌలింగ్ చూస్తుంటే, ఆ పాక్ బౌలర్ గుర్తుకొస్తున్నాడు... ఉమ్రాన్ మాలిక్‌పై శ్రీకాంత్ కామెంట్స్...

జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్... కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్ ఆరంగ్రేటం చేశాడు... మొదటి స్పెల్‌లో 150+ వేగంతో బంతులు వేసిన ఉమ్రాన్ మాలిక్, ఆ తర్వాతి ఓవర్‌లో 151+ వేగంతో బంతులు విసిరాడు...

26

కరోనా బారిన పడిన నటరాజన్ స్థానంలో తాత్కాలిక రిప్లేస్‌మెంట్ పేసర్‌గా జట్టులోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్, భవిష్యత్తులో మంచి ఫాస్ట్ బౌలర్‌గా మారతాడని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

36

‘సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను చూస్తుంటే ముచ్ఛటేస్తోంది. భవిష్యత్తులో అతను అద్భుతమైన ఫాస్ట్ బౌలర్‌గా మారతాడు...

46

ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి నితీశ్ రాణా చాలా ఇబ్బందిపెట్టాడు... ఇది అతనికి మొట్టమొదటి టీ20 మ్యాచ్. ఉమ్రాన్ బౌలింగ్ చూస్తుంటే చాలామందికి జస్ప్రిత్ బుమ్రా గుర్తొచ్చాడు...

56

బుమ్రాలాగే ఉమ్రాన్ మాలిక్ కూడా టీమిండియాకి ప్రధాన వనరుగా మారతాడని ఆశిస్తున్నా. అతని రనప్, బౌలింగ్ యాక్షన్ చూస్తుంటే పాక్ మాజీ బౌలర్ వకార్ యూనిస్ గుర్తుకు వచ్చాడు...

66

ఉమ్రాన్ బౌలింగ్ రనప్‌లో మంచి రిథమ్ ఉంది. అద్భుతమైన పేస్‌తో బంతులు వేస్తున్నాడు. తన బౌలింగ్‌లో నితీశ్ రాణాను డ్యాన్స్ చేయించాడు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్..
 

ఇది కూడా చదవండి: IPL2021: అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్, రషీక్ సలాం... కశ్మీరీ కుర్రాళ్ల సక్సెస్ వెనక ఇర్ఫాన్ పఠాన్...

click me!

Recommended Stories