IPL 2021: నువ్వు తీసుకుంటున్న డబ్బులకు ఇలాగా ఆడేది... సన్‌రైజర్స్ ప్లేయర్‌పై షాన్ పోలాక్ ఫైర్...

First Published Sep 26, 2021, 4:49 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాడ్ ఫేజ్ కొనసాగుతూనే ఉంది. ఫేజ్ 1లో ఏడు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఫేజ్ 2లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది...

2021 సీజన్‌లో మిగిలిన అన్ని ఫ్రాంఛైజీలకు తలా రెండు పాయింట్లు అప్పగించిన ఏకైక జట్టుగా నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

ఫస్టాఫ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఏకైక విజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, సెకండాఫ్‌తో వారితో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఓడి... ఆ జట్టుకి కూడా రెండు పాయింట్లు అప్పగించింది...

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ప్రత్యర్తిని కేవలం 125 పరుగులకే పరిమితం చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ లక్ష్యాన్ని ఛేదించడంలోనూ చతికిలబడింది...

బాల్‌తో మూడు వికెట్లు తీసిన జాసన్ హోల్డర్, బ్యాటుతోనూ రాణించి ఐదు సిక్సర్లతో 47 పరుగులు చేసి ఒంటరిపోరాటం చేయడంతో విజయానికి దగ్గరిగా అయినా వెళ్లగలిగింది ఆరెంజ్ ఆర్మీ...

‘డేవిడ్ వార్నర్ సరైన ఫామ్‌లో లేడు. అతను త్వరలోనే కమ్‌బ్యాక్ ఇస్తాడు. మనీశ్ పాండేకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నా, వాటిని సరిగ్గా వినియోగించడంలో మాత్రం అతను ఫెయిల్ అవుతూనే ఉన్నాడు... 

మనీశ్ పాండే అప్పుడప్పుడూ ఆడుతున్నా, కేదార్ జాదవ్‌కి ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది, ఐపీఎల్‌లోనూ బాగా తీసుకుంటున్నావ్...

నువ్వు తీసుకునే డబ్బులకు కనీస పర్ఫామెన్స్ అయినా ఇవ్వాలి కదా... పర్ఫామెన్స్ ఇవ్వనప్పుడు అతన్ని మళ్లీ మళ్లీ ఎంపిక చేయడం ఎందుకు...

6 మ్యాచులు ఆడినా బాల్‌తో కానీ, బ్యాటుతో కానీ రాణించలేకపోయాడు కేదార్ జాదవ్. అతన్ని మళ్లీ మళ్లీ ఆడించడం కంటే ఓ యంగ్ ప్లేయర్‌కి అవకాశం ఇస్తే బాగుంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ షాన్ పోలాక్..

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మనీశ్ పాండే 23 బంతులాడి ఒకే ఒక్క ఫోర్‌తో 13 పరుగులు చేయగా, కేదార్ 12 బంతుల్లో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

మనీశ్ పాండే, కేదార్ జాదవ్ ఇద్దరినీ పంజాబ్ కింగ్స్ యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో రెండే రెండు ఫోర్లు ఉండడం విశేషం...

click me!