IPL 2021: సురేష్ రైనాని పక్కనబెట్టి, అతనికి అవకాశం ఇవ్వాలి... సంజయ్ మంజ్రేకర్ కామెంట్...

First Published Sep 26, 2021, 3:41 PM IST

గత సీజన్‌తో పోలిస్తే, ఈ ఏడాది అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ ప్లేఆఫ్స్‌కి చేరువైంది చెన్నై సూపర్ కింగ్స్. తొమ్మిది మ్యాచుల్లో ఏడు విజయాలు అందుకున్న సీఎస్‌కే, కేకేఆర్‌తో జరిగే మ్యాచ్ గెలిస్తే మిగిలిన జట్ల గణాంకాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కి చేరుతుంది...

ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫేజ్ 2 మొట్టమొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా ఫెయిల్ అయ్యింది. డుప్లిసిస్ అవుటైన తర్వాత మొయిన్ ఆలీ, సురేష్ రైనా, ఎమ్మెస్ ధోనీ వికెట్లను త్వరత్వరగా కోల్పోయింది సీఎస్‌కే...

ముఖ్యంగా సురేష్ రైనా బ్యాటింగ్ చేసిన విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్, రైనా బ్యాటింగ్ చూస్తుంటే స్కూల్ పిల్లాడిలా అనిపించాడని కామెంట్ చేశాడు...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మెరుపులు మెరిపించకపోయినా కీలక సమయంలో వికెట్లను కాపాడుకుని, నాటౌట్‌గా నిలబడి జట్టుకి విజయాన్ని అందించాడు రైనా...

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడని సురేష్ రైనా, 2021 సీజన్‌లో 9 మ్యాచులు ఆడి 144 పరుగులు చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది...

‘మిగిలిన ఫ్రాంఛైజీలతో పోలిస్తే చెన్నై ఆటతీరు బాగానే ఉంది. అయితే వారి జట్టులోని సురేష్ రైనా, అంబటి రాయుడు సరైనా ఫామ్‌లో లేనట్టు కనిపిస్తోంది...

రాయుడి కంటే రైనా ఆటతీరు మరీ దారుణంగా ఉంది. ఈ ఇద్దరిలో రైనాకి ఇంకా అవకాశాలు ఇవ్వడం అనవసరమని నాకు అనిపిస్తోంది...

చెన్నై సూపర్ కింగ్స్‌ బ్యాటింగ్ లైనప్ చూడడానికి చాలా పటిష్టంగా ఉంది. 8, 9వ స్థానాల్లో వచ్చే డ్వేన్ బ్రావో, సామ్ కుర్రాన్‌లతో పాటు శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్ కూడా బ్యాటింగ్ చేయగలరు...

అందుకే చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవాలంటే మాత్రం కొన్ని మార్పులు చేస్తే బెటర్. సురేష్ రైనాకి బదులుగా కర్ణ్ శర్మకు అవకాశం ఇవ్వాలి... అలాగే ఓ విదేశీ ప్లేయర్‌ను తొలగించి, ఇమ్రాన్ తాహీర్‌ను జట్టులోకి తేవాలి...

రవీంద్ర జడేజా పూర్తి స్థాయి బ్యాట్స్‌మెన్‌లా ఆడుతున్నాడు. కాబట్టి అతన్ని బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇచ్చి, సురేష్ రైనాని తప్పించి కర్ణ్ శర్మను జట్టులోకి తీసుకొస్తే బెటర్...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...

సురేష్ రైనాతో పోలిస్తే మహేంద్ర సింగ్ ధోనీ ఫామ్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌ను ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. మాహీ ఇప్పటిదాకా 9 మ్యాచుల్లో కేవలం 51 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

click me!