IPL2021: ఆర్‌సీబీ ప్లేయర్లకు ఛాన్స్ లేదు, వచ్చే సీజన్‌లో కెప్టెన్సీ అతనికే ఇస్తారు... డేల్ స్టెయిన్ కామెంట్!

Published : Sep 26, 2021, 04:17 PM IST

టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గానూ ఇదే ఆఖరి సీజన్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే సీజన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ ఎవరు? ఐపీఎల్ ఫ్యాన్స్‌ని వెంటాడుతున్న ప్రశ్న ఇది...

PREV
19
IPL2021: ఆర్‌సీబీ ప్లేయర్లకు ఛాన్స్ లేదు, వచ్చే సీజన్‌లో కెప్టెన్సీ అతనికే ఇస్తారు... డేల్ స్టెయిన్ కామెంట్!

మిగిలిన ప్లేయర్లతో పోలిస్తే ఆర్‌సీబీలో మరో స్టార్ క్రికెటర్ లేడు... విరాట్ కోహ్లీ తప్పుకుంటే, కెప్టెన్సీ తీసుకునే ఏబీ డివిల్లియర్స్‌కి కూడా ఇదే ఆఖరి సీజన్ కానుంది...

29

వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహాల్, మహ్మద్ సిరాజ్ వంటి భారత జట్టుకి ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్లు ఉన్నా... వీరిలో కెప్టెన్సీ స్కిల్స్‌ ఇప్పటిదాకా కనిపించలేదు...

39

ఐదు సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్, ఆర్‌సీబీ తర్వాతి కెప్టెన్ రేసులో నిలిచాడు...

49

ఐపీఎల్ 2022 మెగా వేలంలో డేవిడ్ వార్నర్‌ ఉండడం ఖాయమని టాక్ వినబడుతోంది. 2016లో సన్‌రైజర్స్‌కి టైటిల్ అందించి, మూడు సార్లు జట్టును ప్లేఆఫ్స్‌కి చేర్చాడు డేవిడ్ వార్నర్...

59

ఈ సీజన్ మధ్యలో కెప్టెన్సీ తొలగించి, వార్నర్‌ను అవమానించింది సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్. ఆరెంజ్ ఆర్మీ కోసం ఎంతో చేసిన వార్నర్,ఈ ఏడాది తర్వాత ఆ జట్టును వీడేందుకు సిద్ధమైనట్టు సమాచారం...

69

అయితే ఆర్‌సీబీ మాజీ ప్లేయర్ డేల్ స్టెయిన్ మాత్రం డేవిడ్ వార్నర్‌కి కాదు కానీ, పంజాబ్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ కెఎల్ రాహుల్‌‌కి ఆర్‌సీబీ కెప్టెన్సీ దక్కే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు...

79

‘ఆర్‌సీబీ, సుదీర్ఘ కాలం జట్టును నడిపించే కెప్టెన్ కోసం చూస్తే మాత్రం కెఎల్ రాముల్ కరెక్ట్ ప్లేయర్... అతను బెంగళూరుకి ఆడాడు... ఆర్‌సీబీ జట్టు గురించి, మేనేజ్‌మెంట్ గురించి బాగా తెలుసు...

89

నాకెందుకో వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో కెఎల్ రాహుల్ తిరిగి బెంగళూరు జట్టుకి వస్తాడని గట్టిగా అనిపిస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు డేల్ స్టెయిన్...

99

2018 ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు కెఎల్ రాహుల్‌ను రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది. 2020 సీజన్‌లో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆరో స్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్, ఈ సీజన్‌లో 10 మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకుని ప్రస్తుతానికి ఐదో స్థానంలో ఉంది...

click me!

Recommended Stories