‘హిట్‌మ్యాన్’ కొడితే మామూలుగా ఉండదు... ఆసియాలోనే మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్...

Published : Oct 05, 2021, 11:21 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో పెద్దగా లక్ కలిసిరాకున్నా ఆఖరి మ్యాచ్ వరకూ ముంబై ఇండియన్స్‌ని ప్లేఆఫ్ రేసులో నిలబెట్టడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు రోహిత్ శర్మ. రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది రోహిత్ టీమ్ ముంబై ఇండియన్స్...

PREV
110
‘హిట్‌మ్యాన్’ కొడితే మామూలుగా ఉండదు... ఆసియాలోనే మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్...

91 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు ఆరంభం అందించాడు... 

210

13 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 22 పరుగులు చేసిన రోహిత్ శర్మ, చేతన్ సకారియా బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

310

అయితే తన ఇన్నింగ్స్‌లో కొట్టిన రెండు సిక్సర్లతో టీ20 కెరీర్‌లో 400 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు రోహిత్ శర్మ... అదీకాకుండా పవర్‌ ప్లేలోనూ 50 సిక్సర్లను అందుకున్నాడు...

410

భారత్‌ తరుపున టీ20ల్లో 400 సిక్సర్లు కొట్టిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ కాగా, సురేశ్ రైనా 325 సిక్సర్లతో రెండో స్థానంలో, విరాట్ కోహ్లీ 320 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నారు...

510

ఓవరాల్‌గా క్రిస్ గేల్ 1042, పోలార్డ్ 758, రస్సెల్ 510, బ్రెండన్ మెక్‌కల్లమ్ 485, షేన్ వాట్సన్ 467, ఏబీ డివిల్లియర్స్ 434 టీ20 సిక్సర్లతో రోహిత్ శర్మ కంటే ముందున్నారు...

610

ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రా, యూఏఈలో అత్యధిక వికెట్లు తీసిన ఐపీఎల్‌ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. బుమ్రా ఖాతాలో 40 యూఏఈ వికెట్లు ఉండగా చాహాల్ 38, రబాడా 35 వికెట్లతో టాప్ 3లో ఉన్నారు...

710

రాజస్థాన్ విధించిన లక్ష్యాన్ని కేవలం 8.2 ఓవర్లలోనే ఛేదించింది ముంబై ఇండియన్స్. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత వేగవంతమైన ఐదో ఛేదన... ఇంతకుముందు ముంబై, కేకేఆర్‌పై 5.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి టాప్‌లో ఉంది...

810

కృనాల్ పాండ్యా లేకుండా నాలుగేళ్ల తర్వాత మ్యాచ్ ఆడింది ముంబై ఇండియన్స్. 2017లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా బరిలో దిగలేదు. 

910

కృనాల్ పాండ్యా లేకుండా ఆడిన మొదటి మ్యాచ్‌లో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదుచేసిన ముంబై ఇండియన్స్, నేటి మ్యాచ్‌లో యూఏఈలో ఫాస్టెస్ట్ ఛేజ్‌ను రికార్డు చేసింది...

1010

ఐపీఎల్ 2021 సీజన్‌లో సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించిన ఏడో ప్లేయర్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్. ఇంతకుముందు క్రిస్ మోరిస్, శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, ఎమ్మెస్ ధోనీ, షారుక్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ ఈ ఫీట్ సాధించారు...

click me!

Recommended Stories