ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ... అక్కడే తన ఆఖరి మ్యాచ్ ఆడతానంటూ...

First Published Oct 5, 2021, 10:51 PM IST

ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందు అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు మహేంద్ర సింగ్ ధోనీ. అప్పటినుంచే ధోనీ, ఐపీఎల్ నుంచి కూడా త్వరలోనే తప్పుకుంటాడని ఊహగానాలు మొదలయ్యాయి... 

ఐపీఎల్ 2020 సీజన్‌లో సీఎస్‌కే ఆడిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో తనకిది కచ్ఛితంగా చివరి సీజన్ (Definately Not) కాదని కామెంట్ చేసిన మాహీ... 2021 తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటాడని వార్తలు వచ్చాయి...

మాహీ స్నేహితుడు సురేశ్ రైనా కూడా... ‘ధోనీకి ఇదే ఆఖరి సీజన్ కావచ్చు. అయితే ఈసారి సీఎస్‌కే టైటిల్ గెలిస్తే, మరో సీజన్ ఆడేలా మాహీ భాయ్‌ని ఒప్పిస్తా...’ అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే...

తాజాగా ఆన్‌లైన్ ద్వారా ఇచ్చిన సీఎస్‌కే ఫ్యాన్స్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు మహేంద్ర సింగ్ ధోనీ... ఈ సీజన్ కూడా తనకి ఆఖరి కాదని తేల్చేశాడు...

‘నా రిటైర్మెంట్‌ను ఇండిపెండెన్స్ రోజున ఇవ్వాలని అనుకోలేదు. అయితే అంతకంటే మంచి రోజు ఉండదని ఆ నిర్ణయం తీసుకున్నా... ఫేర్‌వేల్ మ్యాచ్ ఉండాలని అనుకోలేదు...

అయితే సీఎస్‌కే ఆడే మ్యాచులు చూసేందుకు మీరు వస్తుంటారు. కాబట్టి నా ఫేర్‌వేల్ మ్యాచ్‌కి అవకాశం ఉంటుందని భావిస్తున్నా... 

అన్నీ బాగైతే చెన్నైలో నా ఆఖరి మ్యాచ్‌, చెన్నై ఫ్యాన్స్ అందరి మధ్య ఆడాలని అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ...

ఐపీఎల్ 2008 వేలంలో సీఎస్‌కేకి కెప్టెన్‌గా ఎంపికైన మహేంద్ర సింగ్ ధోనీ, 2021 వరకూ ఒకే జట్టుకి కెప్టెన్‌గా వ్యవహహరిస్తున్న మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

ఐపీఎల్ కెరీర్‌లో 200 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించిన మొట్టమొదటి క్రికెటర్‌గానూ రికార్డు క్రియేట్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు...

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతులు ఆడి ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు మహేంద్ర సింగ్ ధోనీ. దీంతో 40 ఏళ్ల మాహీ, తప్పుకోవాల్సిన సమయం వచ్చిందంటూ సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ వచ్చింది..

click me!