ఐపీఎల్‌లో ఆడించరు... అయినా అట్టిపెట్టుకున్నారు... కోట్లు పెట్టి కొనుగోలు చేసి...

First Published Feb 1, 2021, 1:40 PM IST

ఐపీఎల్ అంటే ఫుల్లుగా కమర్షియల్ గేమ్. బాగా ఆడతాడని అనుకుంటే, పెద్దగా అనుభవం లేని కుర్రాళ్లకి కూడా కోట్లు పెట్టి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తాయి ఫ్రాంఛైజీలు. పర్ఫామెన్స్ బాగా లేకపోతే, ఎంత ఘనమైన చరిత్ర ఉన్న ప్లేయర్ అయినా కొనడానికి ఏ జట్టు ఆసక్తి చూపదు... అయితే 2021 మినీ వేలానికి ముందు కొందరు బాగా ఆడని ప్లేయర్లను అట్టిపెట్టుకున్నాయి ఫ్రాంఛైజీలు.

జయ్‌దేవ్ ఉనద్కడ్...ఐపీఎల్‌లో జయ్‌దేవ్ ఉనద్కడ్ పేరు ఓ సంచలనం. 2018 వేలంలో ఏకంగా రూ.11 కోట్ల 50 లక్షలు పెట్టి ఉనద్కడ్‌ను కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్...
undefined
2017 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆఖరి ఓవర్‌లో హ్యాట్రిక్ తీసి, మెయిడిన్ వేసిన జయ్‌దేవ్ పర్ఫామెన్స్‌కి మెచ్చి, భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసింది ఆర్ఆర్...
undefined
అయితే 2019లో మళ్లీ వేలానికి వదిలి, తిరిగి రూ.8 కోట్ల 40 లక్షలకు ఉనద్కడ్‌ను కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్...
undefined
ఆ తర్వాత 2020లోనూ ఉనద్కడ్‌ను వేలానికి వదిలేసి, తిరిగి రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది ఆర్ఆర్...
undefined
నిజానికి 2018, 2019 సీజన్‌లలో కానీ, 2020 సీజన్‌లో కానీ జయ్‌దేవ్ ఉనద్కడ్ పెద్దగా పర్ఫామెన్స్ ఇచ్చింది లేదు... అయినా అతన్ని వదులకోవడానికి ఆర్ఆర్ ఇష్టపడడం లేదు.
undefined
2020లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా వ్యవహారించిన స్టీవ్ స్మిత్‌ను వేలానికి వదిలేయడానికి కూడా జయదేవ్ ఉనద్కడ్‌ జట్టులో ఉండకూడదని అతను పట్టుబట్టడమే అని టాక్.
undefined
2018లో 15 మ్యాచులు ఆడిన జయ్‌దేవ్ ఉన్కడ్, 11 వికెట్లు తీశాడు. 2019లో 11 మ్యాచుల్లో 10, 2020 సీజన్‌లో ఏడు మ్యాచుల్లో నాలుగే వికెట్లు తీశాడు. అయినా అతన్ని వదలిపెట్టడం లేదు రాజస్థాన్ రాయల్స్...
undefined
క్రిస్ జోర్డాన్: 2020 సీజన్‌లో క్రిస్ జోర్డాన్‌ను రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్... అయితే డెత్ ఓవర్ స్పెషలిస్టుగా జట్టులోకి వచ్చిన జోర్డాన్, పెద్దగా రాణించలేకపోయాడు.
undefined
2020 సీజన్‌లో 9 మ్యాచులు ఆడిన క్రిస్ జోర్డాన్ 9 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లోనూ 29 పరుగులు మాత్రమే చేశాడు. అయినా అతన్ని అట్టిపెట్టుకుంది పంజాబ్...
undefined
జోష్ హజల్‌వుడ్: ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ జోష్ హజల్‌వుడ్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...
undefined
అయితే గత సీజన్‌లో మూడు మ్యాచులు మాత్రమే ఆడిన జోష్ హజల్‌వుడ్ కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. అయితే టీమిండియాపై అతని ప్రదర్శన ఆధారంగా హజల్‌వుడ్‌ను అట్టిపెట్టుకుంది సీఎస్‌కే...
undefined
రింకూ సింగ్: దేశవాళీ క్రికెట్‌లో మంచి బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన రింకూ సింగ్‌ని 2018లో రూ.80 లక్షలకు కొనుగోలు చేసింది కేకేఆర్...
undefined
అయితే ఏ సీజన్‌లోనూ అతనికి పెద్దగా అవకాశం ఇచ్చింది లేదు. మొత్తంగా ఇప్పటిదాకా నాలుగు సీజన్లలోనూ కలిపి 11 మ్యాచులే ఆడాడు రింకూ సింగ్. గత మ్యాచ్‌లో ఒకే మ్యాచ్ ఆడిన రింకూ 11 పరుగులు చేశాడు.
undefined
ఆడమ్ జంపా: ఆస్ట్రేలియా యంగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాను కోటిన్నర పెట్టి కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... అయితే గత సీజన్‌లో మూడు మ్యాచులు ఆడిన ఆడమ్ జంపా కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు...
undefined
2016లో పూణెకి ఆడిన సమయంలో 5 మ్యాచుల్లో 12 వికెట్లు తీసిన జంపా పర్ఫామెన్స్ మీద ఉన్న నమ్మకంతో అతన్ని 2021 సీజన్‌కి కూడా అట్టిపెట్టుకుంది ఆర్‌సీబీ...
undefined
కుల్దీప్ యాదవ్: గత సీజన్‌లో కుల్దీప్ యాదవ్‌కి పెద్దగా అవకాశాలు రాలేదు. 5 మ్యాచుల్లో కుల్దీప్ యాదవ్ ఆడినప్పటికీ వేసిన ఓవర్లు మొత్తం 12 మాత్రమే. ఆడించకపోయినా కుల్దీప్ యాదవ్‌ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు కేకేఆర్...
undefined
click me!