అప్పుడు అభిమానించాం... ఇప్పుడు శత్రువులుగానే భావిస్తాం... గెలవాలంటే తప్పదు... స్టువర్ట్ బ్రాడ్...

First Published Feb 1, 2021, 12:51 PM IST

యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల బీభత్సం గుర్తుకొచ్చినప్పుడల్లా ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా గుర్తుకువస్తాడు. బ్రాడ్ బౌలింగ్‌లోనే ఈ అద్భుతమైన ఫీట్ సాధించాడు యువీ. 34 ఏళ్ల ఈ పేసర్, ఇప్పటికీ అద్భుతమైన ప్రదర్శన ఇస్తూ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఉన్నాడు.

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 69 వికెట్లు తీసిన స్టువర్ట్ బ్రాడ్, ప్యాట్ కమ్మిన్స్ 70 వికెట్ల రికార్డును అధిగమించడానికి 2 వికెట్ల దూరంలో ఉన్నాడు...
undefined
టీమిండియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్... ఆస్ట్రేలియా సిరీస్‌లో టీమిండియాను అభిమానించామని, అయితే ప్రస్తుత సిరీస్‌లో శత్రువుగా చూడాల్సి వస్తుందని తెలిపాడు...
undefined
‘ఆస్ట్రేలియా భారత జట్టు సాధించిన విజయాన్ని ఏ జట్టు అయినా గర్వపడాల్సిందే... సీనియర్లు లేకుండా, అనేక మంది గాయాలతో బాధపడుతూ ఉంటే కుర్రాళ్లతోనే గెలిచి చూపించింది టీమిండియా...
undefined
గబ్బా టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా గెలవాలని మేం కూడా గట్టిగా కోరుకున్నాం... యువజట్టుతో వారు ఆడిన తీరు చూసి ఫిదా అయిపోయాం...
undefined
ప్రస్తుతం టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా టాప్‌లో ఉంది... మాకు ఫైనల్ ఆడే అవకాశం రావాలంటే, వారిని ఓడించి తీరాల్సిందే...
undefined
అందుకే ఇప్పుడు టీమిండియాను మేం శత్రువులుగా భావించాల్సి ఉంటుంది... స్వదేశంలో వారిని ఓడించడం అంత తేలికైన పని కాదు...
undefined
నేను చూసిన ప్లేయర్లలో విరాట్ కోహ్లీ ది బెస్ట్ బ్యాట్స్‌మెన్... నేను మాత్రమే కాదు, చాలామంది ఈ విషయాన్ని ఒప్పుకుని తీరాల్సిందే... పిచ్‌తో, బౌలర్లతో సంబంధం లేకుండా విరాట్ కోహ్లీ పరుగులు సాధిస్తాడు...
undefined
అయితే ఇంగ్లాండ్ జట్టు ఏమీ బలహీనంగా లేదు.. మా జట్టులో కూడా వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఆల్‌రౌండర్లు ఉన్నారు... పోరాడితే, విజయం సాధించగలమనే నమ్మకం మాకుఉంది...’ అంటూ చెప్పుకొచ్చాడు స్టువర్ట్ బ్రాడ్...
undefined
ఇప్పటిదాకా 144 టెస్టులు ఆడిన స్టువర్ట్ బ్రాడ్, 517 వికెట్లు పడగొట్టాడు. 121 వన్డేల్లో 178, 56 టీ20 మ్యాచుల్లో 65 వికెట్లు పడగొట్టాడు స్టువర్ట్ బ్రాడ్..
undefined
వన్డేలకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించనప్పటికీ 4 ఏళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో చోటు కోల్పోయాడు స్టువర్ట్ బ్రాడ్... కొన్నాళ్లు పాటు ఇంగ్లాండ్ వన్డే, టీ20 కెప్టెన్‌గా కూడా వ్యవహారించాడు బ్రాడ్...
undefined
click me!