IPL 2021: అతను కెప్టెన్ కాదు, కేవలం బ్యాట్స్‌మెన్ మాత్రమే... అజయ్ జడేజా కామెంట్స్...

Published : Oct 04, 2021, 03:44 PM IST

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ మార్చినట్టుగా, మరే జట్టు కెప్టెన్లను మార్చలేదేమో... గత రెండు సీజన్లుగా పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు కెఎల్ రాహుల్. అయితే జట్టును కనీసం ప్లేఆఫ్స్‌కి కూడా చేర్చలేకపోయాడు...

PREV
19
IPL 2021: అతను కెప్టెన్ కాదు, కేవలం బ్యాట్స్‌మెన్ మాత్రమే... అజయ్ జడేజా కామెంట్స్...

విజయం అంచుల దాకా వచ్చిన మ్యాచ్‌ను చేజేతులా ఎలా చేజార్చుకోవాలో పంజాబ్ కింగ్స్ మ్యాచులను చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది... 

29

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాగే జరిగింది. మొదటి వికెట్‌కి 91 పరుగుల భాగస్వామ్యం నమోదుచేసిన తర్వాత కూడా మిడిల్ ఆర్డర్ వైఫల్యంలో 165 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక 6 పరుగుల దూరంలో ఆగిపోయింది పంజాబ్...

39

పంజాబ్ కింగ్స్ జట్టు విజయాల సంగతి ఎలా ఉన్నా, ఆరెంజ్ క్యాప్ రేసులో మాత్రం టాప్‌లో దూసుకుపోతున్నాడు కెఎల్ రాహుల్... 
(Photo Source- Instagram)

49

గత సీజన్‌లో 14 మ్యాచుల్లో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన కెఎల్ రాహుల్, ఈ సీజన్‌లో 11 మ్యాచుల్లో 500+ పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు...

59

‘కెఎల్ రాహుల్ రెండు సీజన్లుగా పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు... అయితే అతను నాకెప్పుడూ ‘లీడర్’ కనిపించలేదు... కేవలం ఓ బ్యాట్స్‌మెన్‌గానే కనిపిస్తున్నాడు...

69

కెప్టెన్ అనేవాడు కేవలం పరుగులు చేస్తే సరిపోదు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టును విజయతీరాలకు చేర్చగల సమర్థుడై ఉండాలి... కానీ పంజాబ్ కింగ్స్ పరిస్థితి వేరు...

79

పంజాబ్ కింగ్స్‌లో చాలా మంచి ప్లేయర్లు ఉన్నారు, భారీ హిట్టర్లు ఉన్నారు. అయితే విన్నింగ్ మార్జిన్‌ను దాటడం ఎలాగో వాళ్లకు తెలియడం లేదంటే... అది కెప్టెన్సీలో లోపమే...

89

నాయకత్వ లక్షణాలు ఉన్నవారే టీమిండియాకి కెప్టెన్‌ కాగలరు. కెఎల్ రాహుల్ అందరితో చాలా సున్నితంగా మాట్లాడతాడు, ప్రతీదానికి సర్దుకుపోతుంటాడు... నాయకుడికి ఇలాంటి లక్షణాలు ఉండకూడదు...

99

కెఎల్ రాహుల్ ఫిలాసఫీ, ఇండియన్ టీమ్ కెప్టెన్సీకి ఏ మాత్రం సరిపోదు. జట్టును సుదీర్ఘకాలం తన భుజాలపై మోసే సామర్థ్యం అతనిలో కనిపించడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా...

click me!

Recommended Stories