Rishabh Pant: రిషభ్ పంత్ ప్రేమ వ్యవహారాలు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మాములోడు కాదుగా..!

First Published Oct 4, 2021, 11:59 AM IST

Happy Birthday Rishabh pant: క్రికెట్ లో అరంగ్రేటం చేసిన ఆనతి కాలానికే  తాను ఊహించని కెరీర్ అందుకున్న అతికొద్దిమంది క్రికెటర్లలో రిషభ్ పంత్ కూడా ఒకడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇరవై ఏళ్ల ప్రాయంలో అడుగుపెట్టాడు.  గ్రౌండ్ లో అదిరిపోయే ఆటతో సూపర్బ్ అనిపించే ఈ ఢిల్లీ బ్యాట్స్మెన్ ప్రేమ వ్యవహారాల్లోనూ ఆరితేరాడు. 

ఉత్తరాఖండ్ కు చెందిన రిషభ్ పంత్.. భారత క్రికెట్ లో అడుగుమోపడానికి చాలా  కష్టపడ్డాడు. 1997 అక్టోబర్ 4న హరిద్వార్ జిల్లా రూర్కీలో జన్మించిన పంత్.. అండర్-19 స్థాయి నుంచే భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ హ్యాండ్సమ్ క్రికెటర్ ఐపీఎల్ లో అదరగొట్టి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 

ధోని వారసుడిగా గుర్తింపు పొందుతున్న పంత్.. తన సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో ఆ జట్టు టేబుల్ టాపర్ చెన్నైతో కలిసి సమానంగా ఉందంటేనే పంత్ నాయకత్వ పటిమను అర్థం చేసుకోవచ్చు.

అయితే గ్రౌండ్ లో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడే ఈ హ్యాండ్సమ్ కీపర్.. ప్రేమ వ్యవహారాల్లోనూ ఆరితేరాడు. బాలీవుడ్ బామలతోనూ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేటింగ్ చేశాడు. 

ప్రస్తుతం ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇంటిరీయర్ డిజైనర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇషా నేగి తో పంత్ డేటింగ్ చేస్తున్నాడు. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నేగి.. ఇన్స్టాగ్రామ్ లో తన క్యూట్, హాట్ లుక్స్ తో కుర్రకారు మతులు పోగొడుతున్నది.  గతేడాది పంత్, నేగి కలిసి తీసుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 

పంత్.. నేగి కంటే ముందు బాలీవుడ్ వర్ధమాన నటి ఊర్వశి రౌతేలాతో డేటింగ్ చేశాడు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని  వార్తలు వినిపించాయి. 2019లో ఈ ఇద్దరూ కలిసి ఓ ఖరీదైన హోటల్లో రాత్రుల్లు డిన్నర్ కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. 

కానీ ఏం జరిగిందో ఏమో గానీ ఊర్వశితో పంత్ కు సంబంధాలు తెగిపోయాయి. పంత్ కు చాలాసార్లు ఫోన్, వాట్సాప్ చేసినా అతడు రిప్లై ఇవ్వలేదని ఒకసారి ఊర్వశి వాపోయింది. 

త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి విరాట్ నిష్క్రమిస్తుండటంతో ఆ స్థానానికి రోహిత్ శర్మ తో పాటు కెఎల్ రాహుల్, రిషభ్ పంత్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

Rishabh Pant

అయితే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో తప్పకుండా టీమ్ ఇండియాకు సారథ్యం వహించే అవకాశం పంత్ కు దక్కుతుందనడంలో సందేహం లేదని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. 

click me!