150 కి.మీ.ల వేగంతో నిప్పులు చెరిగే బంతులు, ఎవరీ ఉమ్రాన్ మాలిక్... జట్టులో లేకుండా ఎలా ఆడాడు...

First Published Oct 3, 2021, 10:21 PM IST

ఐపీఎల్‌లో మిగిలిన జట్లతో పోలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచనా విధానమే భిన్నంగా ఉంటుంది. మాకొద్దీ ప్లేయర్ అని సీఎస్‌కే వదిలించుకున్న కేదార్ జాదవ్‌ను రూ.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

రిజర్వు బెంచ్‌లో ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, జాసన్ రాయ్ వంటి ప్లేయర్లు అందుబాటులో ఉన్నా, వారికి అవకాశం ఇచ్చేందుకు ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకునేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది...

తాజాగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా యంగ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, సన్‌రైజర్స్ తరుపున ఆరంగ్రేటం చేశాడు...

ఐపీఎల్‌లో తన మొదటి బంతిని 145 కి.మీ.ల వేగంతో వేసిన ఉమ్రాన్ మాలిక్, ఆ తర్వాత 142, 150, 147, 143, 142 కి.మీ.ల వేగంతో బంతులు వేశాడు....

ఐపీఎల్ 2021 సీజన్‌లో 150 కి.మీ.ల వేగం మార్కును అందుకున్న మొట్టమొదటి భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఉమ్రాన్ మాలిక్...

టి నటరాజన్ కరోనా కారణంగా జట్టుకి దూరం కావడంతో, అతనికి రిప్లేస్‌మెంట్‌గా తుదిజట్టులోకి వచ్చాడు ఉమ్రాన్ మాలిక్... 

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి నెట్‌బౌలర్‌‌గా ఉన్న ఉమ్రాన్ మాలిక్, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలో జన్మించాడు. తన కెరీర్‌లో ఓ టీ20, ఓ లిస్టు ఏ మ్యాచ్ ఆడిన ఉమ్రాన్ మాలిక్, కేవలం నట్టూ కోలుకునేవరకే సన్‌రైజర్స్ జట్టులో సభ్యుడిగా ఉంటాడు...

రెగ్యులేషన్ 6.1 (సీ) రూల్ ప్రకారం ఎవరైనా ఆటగాడు గాయపడినా, కరోనా కారణంగా బయో సెక్యూలర్ జోన్‌కి దూరమైనా... అతని స్థానంలో తాత్కాలికంగా మరో ప్లేయర్‌ను ఆడించే అవకాశం ఉంటుంది... ఇదే రూల్‌ను వాడి ఉమ్రాన్‌ను కేకేఆర్‌తో మ్యాచ్‌లో బరిలో దింపింది సన్‌రైజర్స్...

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన అబ్దుల్ సమద్‌, ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ ఆకట్టుకోగా ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ కూడా ఆరంభ ఓవర్‌లోనే అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరికీ వచ్చే సీజన్‌లో మంచి ధర పలికే అవకాశం ఉంది...

click me!