ముంబై ఇండియన్స్ ముందుగానే ఓడడం, టీమిండియాకి మంచిదే... టీ20 వరల్డ్‌కప్ కోసం...

First Published Oct 9, 2021, 3:07 PM IST

వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండడంతో ఐపీఎల్ 2021 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది... అయితే ఇది టీమిండియాకి మంచి చేస్తుందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో అత్యధికంగా ముంబై ఇండియన్స్ నుంచి ఆరుగురు ప్లేయర్లకు అవకాశం దక్కింది...

ఐపీఎల్ సెకండ్ ఫేజ్ ఆరంభంలో ఫామ్‌లో లేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్... ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చెరో 80+ పరుగులు చేసి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చారు...

ముంబై ఇండియన్స్ ఐదో స్థానంతోనే సరిపెట్టుకున్నా, టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు కావాల్సినంత విశ్రాంతి తీసుకునేందుకు ప్లేయర్లకు విలువైన సమయం దొరికినట్టైంది...

ముంబై ఇండియన్స్‌ జట్టులో ఉన్న రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, రాహుల్ చాహార్‌లకు టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కింది...

వీరిలో హార్ధిక్ పాండ్యా, రాహుల్ చాహార్‌ ఫామ్‌పై ఇంకా అనుమానాలు ఉన్నాయి. వీరి స్థానంలో యజ్వేంద్ర చాహాల్, శ్రేయాస్ అయ్యర్ లేదా శార్దూల్ ఠాకూర్‌లకు తుదిజట్టులో చోటు దక్కవచ్చని టాక్ నడుస్తోంది...

అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచిన కెఎల్ రాహుల్, పేసర్ మహ్మద్ షమీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌లకు మెగా టోర్నీ ముందు విశ్రాంతి దక్కనుంది...

ప్లేఆఫ్స్‌కి చేరిన నాలుగు జట్లలో విరాట్ కోహ్లీ, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి కీ ప్లేయర్లు ఉన్నారు...

అక్టోబర్ 15న ఫైనల్ ఆడే టీమిండియా, 24న టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న ఆఫ్ఘాన్‌తో మ్యాచులు ఆడుతుంది.

click me!