ఆ ఇద్దరి కంటే మనీశ్ అన్న కెప్టెన్సీ బాగుందే... ముంబైపై సన్‌రైజర్స్ ఇంత స్కోరు చేసిందంటే...

First Published Oct 9, 2021, 1:24 PM IST

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్. కేన్ విలియంసన్, భువనేశ్వర్ కుమార్ గాయపడడంతో వారి స్థానంలో మనీశ్ పాండేకి కెప్టెన్సీ అప్పగించింది...

నాలుగు సీజన్ల పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా వ్యవహరించి, 2016లో టైటిల్ అందించిన మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అందుబాటులో ఉన్నా, అతన్ని పట్టించుకోకుండా మనీశ్ పాండేకి సారథ్యం అందించింది ఎస్‌ఆర్‌‌హెచ్...

ఐపీఎల్‌లో ఇప్పటికే 153 మ్యాచులు ఆడిన మనీశ్ పాండే, అత్యధిక మ్యాచుల తర్వాత కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

ఇంతకుముందు ఈ రికార్డు 137 ఐపీఎల్ మ్యాచుల తర్వాత కెప్టెన్సీ చేసిన ముంబై ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్ ఖాతాలో ఉండేది...

ఈ సీజన్ ఆరంభంలో డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా 2021 ఐపీఎల్‌ను ప్రారంభించింది సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆరు మ్యాచుల తర్వాత వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి కేన్ విలియంసన్‌ని కెప్టెన్‌గా నియమించింది... మనీశ్ పాండే ముచ్ఛటగా మూడో కెప్టెన్...

ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్‌ల కంటే మెరుగ్గా కెప్టెన్సీ చేసినట్టు కనిపించాడు మనీశ్ పాండే. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే భారీ స్కోరు చేయక తప్పని మ్యాచ్‌ను దూకుడుగా ఆరంభించింది ముంబై ఇండియన్స్...

ఇషాన్ కిషన్ ధాటికి ఐదు ఓవర్లు ముగిసే సమయానికే 78 పరుగులు చేసింది ముంబై. ఇదే స్పీడ్‌లో వెళ్లి ఉంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు దాదాపు 260+ టార్గెట్ ఉండి ఉండేది. 

అయితే ఉన్నంతలో బౌలింగ్ వనరులను చక్కగా ఉపయోగించుకున్న మనీశ్ పాండే, ముంబై ఇండియన్స్ భారీ స్కోరు ఆశలపై నీళ్లు పోశాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మినహా... మిగిలిన ప్లేయర్లు ఎవ్వరూ 20+ స్కోరు కూడా చేయలేకపోయారు...

కీలక సమయంలో పరుగులకు అడ్డుకట్ట వేయడంతో ముంబై ఇండియన్స్ ప్లేఆశలు ఆవిరైపోయాయి... ప్రత్యర్థికి 235 పరుగుల భారీ స్కోరు అందించిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడున్న ఫామ్‌లో కనీసం 100 అయినా చేస్తుందా? అని అనుమానించారు ఆరెంజ్ ఆర్మీ అభిమానులు...

అయితే ఆశ్చర్యకరంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్, ముంబై ఇండియన్స్ గుండెళ్లో గుబులు రేపారు. ఒకానొకదశలో 16 ఓవర్లలో 166 పరుగులు చేసిన ఆరెంజ్ ఆర్మీ, కాస్త గట్టిగా ప్రయత్నిస్తే ఈజీ విక్టరీ అందుకుంటుందని అనిపించింది...

ట్రెంట్ బౌల్ట్, జస్ప్రిత్ బుమ్రా, జేమ్స్ నీశమ్, నాథన్ కౌంటర్‌నైల్ వంటి టాప్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొంటూ 193 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

ఇందులో ఓ ఎండ్‌లో వరుస వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో నిలబడిన మనీశ్ అన్న, 41 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు... సన్‌రైజర్స్ కెప్టెన్‌కి ఈ సీజన్‌లో ఇదే అత్యుత్తమ స్కోరు...

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కి ఇదే అత్యుత్తమ స్కోరు కూడా. ఆరెంజ్ ఆర్మీ ఈ రేంజ్‌లో పర్ఫామెన్స్ ఇచ్చిందంటే కూడా నమ్మలేకపోతున్నారు ఫ్యాన్స్... 

అంతాబాగానే ఉన్నా ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసి, నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చిన యంగ్ బౌలర్ అభిషేక్ శర్మకు మళ్లీ ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

click me!