లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టి గెలిపిస్తే, ఆ కిక్కే వేరబ్బా... రోహిత్ శర్మ నుంచి కెఎస్ భరత్ దాకా ఆఖరి బంతికి..

Published : Oct 09, 2021, 11:53 AM IST

ఐపీఎల్ 2021 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన రెండు మ్యాచులు ఉత్కంఠభరితంగా సాగి క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించాయి.... మొదటి మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఢిల్లీ ఓడితే, ఆఖరి మ్యాచ్‌లో చివరి బంతికి ఆర్‌సీబీ గెలిచింది...

PREV
18
లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టి గెలిపిస్తే, ఆ కిక్కే వేరబ్బా... రోహిత్ శర్మ నుంచి కెఎస్ భరత్ దాకా ఆఖరి బంతికి..

ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫస్టాఫ్‌లో మార్చి 22న జరిగిన మ్యాచ్ కూడా ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ, 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది...

28

172 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్... 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులకు పరిమితమైంది. ఆఖరి బంతికి 6 పరుగులు కావాల్సిన దశలో రిషబ్ పంత్ కొట్టిన షాట్‌కి ఫోర్ మాత్రమే వచ్చింది...

38

అయితే ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో మాత్రం తెలుగు కుర్రాడు కెఎస్ భరత్ సంచలనం సృష్టించాడు. ఆఖరి బంతికి విజయానికి 5 పరుగులు కావాల్సిన స్థితిలో సిక్సర్ బాది మ్యాచ్‌ను ఘనంగా ముగించాడు...
(Photo source- iplt20.com)

48

ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి జట్టుకి విజయాన్ని అందించిన 9వ ప్లేయర్ కోన శ్రీకర్ భరత్. ఇంతకుముందు రోహిత్ శర్మ మూడుసార్లు ఈ ఫీట్ సాధించడం మరో విశేషం...

58

కేకేఆర్, పూణే వారియర్స్, ఢెక్కన్ ఛార్జర్స్‌పై ఆఖరి బంతికి సిక్సర్ బాది విజయాన్ని అందించాడు రోహిత్ శర్మ. అంబటి రాయుడు ముంబై ఇండియన్స్‌లో ఉన్నప్పుడు కేకేఆర్‌పై ఈ ఫీట్ సాధించాడు...

68

సౌరబ్ తివారి- పూణే వారియర్స్‌పై, డీజే బ్రావో- కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై, మహేంద్ర సింగ్ ధోనీ - పంజాబ్ కింగ్స్‌పై, మిచెల్ సాంట్నర్- రాజస్థాన్ రాయల్స్‌పై ఈ ఫీట్ సాధించారు...

78

నికోలస్ పూరన్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై, రవీంద్ర జడేజా- కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై ఆఖరి బంతికి సిక్స్ బాది విజయాన్ని అందించిగా ఢిల్లీపై ఈ ఫీట్ సాధించిన మొదటి ప్లేయర్‌గా నిలిచాడు శ్రీకర్ భరత్...

88

ఆఖరి బంతికి 5 లేదా 6 పరుగులు కావాల్సిన దశలో సిక్స్ కొట్టి గెలిపించిన మూడో ప్లేయర్ శ్రీకర్ భరత్. ఇంతకుముందు 2012లో బ్రావో, కేకేఆర్‌పై, 2016లో ఎమ్మెస్ ధోనీ- పంజాబ్ కింగ్స్‌పై ఈ ఫీట్ సాధించారు...

(Photo source- iplt20.com)

click me!

Recommended Stories