IPL2021 CSK vs KKR: దంచికొట్టిన రవీంద్ర జడేజా... ఆఖరి బంతికి సీఎస్‌కే థ్రిల్లింగ్ విన్..

First Published Sep 26, 2021, 7:33 PM IST

ఐపీఎల్ 2021లో మరోవైపు క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్‌లాంటి మజాను అందించింది. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో గెలిచి, ప్లేఆఫ్స్‌కి చేరుకుంది చెన్నై సూపర్ కింగ్స్...

172 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కి ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యాడు...

28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఆండ్రే రస్సెల్ బౌలింగ్‌లో మోర్గాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

30 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అవుట్ కాగా అంబటి రాయుడు 9 బంతుల్లో 10 పరుగులు చేసి నరైన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు...

28 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో అవుట్ కాగా... సురేష్ రైనా 7 బంతుల్లో 11 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు...

ఎమ్మెస్ ధోనీ నాలుగు బంతుల్లో ఒకే పరుగు చేసి వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్ అయ్యాడు. ఆఖరి రెండు ఓవర్లలో విజయానికి 27 పరుగులు కావాల్సిన దశలో రవీంద్ర జడేజా, ప్రసిద్ద్ కృష్ణ బౌండరీల మోత మోగించాడు...

రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 22 పరుగులు పరుగులు రాబట్టిన రవీంద్ర జడేజా, మ్యాచ్‌ను పూర్తిగా చెన్నై సూపర్ కింగ్స్‌కి మలుపు తిప్పాడు...

20వ ఓవర్ వేసిన సునీల్ నరైన్, మొదటి బంతికే సామ్ కుర్రాన్‌ను అవుట్ చేయగా, రెండో బంతికి పరుగులేమీ రాలేదు. అయితే ఆ తర్వాతి బంతికి శార్దూల్ ఠాకూర్ 3 పరుగులు తీశాడు...

విజయానికి 3 బంతుల్లో ఒక్క పరుగు కావాల్సిన దశలో నాలుగో బంతికి పరుగులేమీ రాలేదు. ఆ తర్వాత ఐదో బంతికి జడ్డూ ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ అయ్యాడు. ఆఖరి బంతికి సింగిల్ కావాల్సిన దశలో దీపక్ చాహార్ సింగిల్ తీసి మ్యాచ్‌ను ముగించాడు..

click me!