IPL2021 MI vs KKR: టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... బరిలో రోహిత్ శర్మ...

Published : Sep 23, 2021, 07:10 PM IST

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు, ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.... పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ముంబైకి, ఆరో స్థానంలో ఉన్న కేకేఆర్‌కి ఈ మ్యాచ్ చాలా కీలకం...

PREV
17
IPL2021 MI vs KKR: టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... బరిలో రోహిత్ శర్మ...
Photo Credit BCCI

గత మ్యాచ్‌లో గాయం కారణంగా బరిలో దిగిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, నేటి మ్యాచ్‌లో ఆడుతున్నాడు. అన్‌మోల్‌ప్రీత్ సింగ్ స్థానంలో రోహిత్ తుదిజట్టులో రాక, హార్ధిక్ పాండ్యా నేటి మ్యాచ్‌కి కూడా దూరమయ్యాడు..

27

ఫేజ్ 2లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోతే, కేకేఆర్, ఆర్‌సీబీపై ఘన విజయాన్ని అందుకున్న ఉత్సాహంతో  ఉంది...

37
Mumbai Indians

8 మ్యాచుల్లో మూడు విజయాలు మాత్రమే అందుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన ఆరు మ్యాచుల్లో ఐదు మ్యాచుల్లో కచ్ఛితంగా గెలవాల్సి ఉంటుంది... 

47
Mumbai Indians

ఇండియాలో జరిగిన ఫస్టాఫ్‌లో ఇబ్బందిపడిన ముంబై ఇండియన్స్, ఫేజ్ 2లో జరిగిన మొదటి మ్యాచ్‌లో సాధారణ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది...

57

8 మ్యాచుల్లో నాలుగింట్లో గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్... ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఆరు మ్యాచుల్లో నాలుగు మ్యాచుల్లో గెలవాల్సి ఉంటుంది...

67
Mumbai Indians

ముంబై ఇండియన్స్: డి కాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సౌరబ్ తివారి, కృనాల్ పాండ్యా, పోలార్డ్, ఆడమ్ మిల్నే, రాహుల్ చాహార్, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ 

77

 

కోల్‌కత్తా నైట్‌రైడర్స్: శుబ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణా, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, లూకీ ఫర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ 

click me!

Recommended Stories