IPL2021: మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో రికార్డు... ఐపీఎల్‌లో 100 క్యాచులు అందుకున్న మొట్టమొదటి...

First Published Sep 30, 2021, 10:34 PM IST

చెన్నై సూపర్ కింగ్స్‌కి 2020 ఐపీఎల్ సీజన్ ఓ పీడకలలా మారితే, ఆ తర్వాత వచ్చిన 2021 సీజన్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చింది సీఎస్‌కే... గత సీజన్‌లో ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచిన సీఎస్‌కే, ఈ ఏడాది ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది... 

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు క్యాచులు అందుకున్న సీఎస్‌కే వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ... ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 100 క్యాచులు పూర్తిచేసుకున్నాడు...

ఐపీఎల్‌లో అత్యధిక క్యాచులు అందుకున్న వికెట్ కీపర్‌గా టాప్‌లో ఉన్న ఎమ్మెస్ ధోనీ, సీఎస్‌కేపై రెండేళ్లు నిషేధం పడిన సమయంలో పూణే సూపర్ జెయింట్స్ తరుపున ఆడిన సమయంలో పట్టిన క్యాచులు తీసివేస్తే.. సీఎస్‌కే తరుపునే 100 క్యాచులు అందుకున్నాడు...

చెన్నై సూపర్ కింగ్స్ మరో ప్లేయర్, ‘చిన్నతలా’ సురేష్ రైనా 98 క్యాచులతో రెండో స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్ 94 క్యాచులతో మూడో స్థానంలో ఉన్నాడు...

ఒకే మ్యాచ్‌లో మూడు అంతకంటే ఎక్కువ క్యాచులు అందుకోవడం మహేంద్ర సింగ్ ధోనీకి ఇది 10వ సారి. ఏబీ డివిల్లియర్స్ 5 సార్లు, రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, డి కాక్, పార్థివ్ పటేల్, మనీశ్ పాండే, రాబిన్ ఊతప్ప, రైనా, సాహా నాలుగేసి సార్లు ఈ ఫీట్ సాధించారు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో అదరగొడుతున్న సీఎస్‌కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్ ఇద్దరూ కూడా 400+ పరుగులు పూర్తిచేసుకున్నారు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 591+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్... సీఎస్‌కే తరుపున ఒకే సీజన్‌లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా నిలిచారు...

మైక్ హుస్సీ, సురేష్ రైనా 2013లో 587 పరుగులు జోడించగా.. రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్ జోడీ ఆ రికార్డును అధిగమించి టాప్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఇద్దరికీ ఇంకా కనీసం ఐదు మ్యాచులు మిగిలి ఉండడం విశేషం..

click me!