ఆ జట్టులో పది మంది ప్లేయర్లు మాత్రమే ఆడుతున్నారు, ధోనీ వారికి కేవలం... ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు...

Published : Sep 30, 2021, 08:19 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాప్‌లో కొనసాగుతోంది. 10 మ్యాచుల్లో 8 విజయాలు అందుకుని, ప్లేఆఫ్ బెర్త్ దాదాపు కన్ఫార్మ్ చేసుకుంది. అయితే మాహీ ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా లేరు. కారణం... ధోనీ పేలవ ఫామ్....

PREV
17
ఆ జట్టులో పది మంది ప్లేయర్లు మాత్రమే ఆడుతున్నారు, ధోనీ వారికి కేవలం... ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు...

ఐపీఎల్ 2020 సీజన్‌లో సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించకపోయినా, ఎమ్మెస్ ధోనీ బ్యాటింగ్‌లో 200 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అత్యధిక స్కోరు 47 నాటౌట్...

27

ఐపీఎల్ 2021 సీజన్‌లో మాత్రం ఇప్పటిదాకా 11 మ్యాచుల్లో కలిపి మహేంద్ర సింగ్ ధోనీ చేసిన మొత్తం 52 పరుగులు మాత్రమే...

37

‘చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. కానీ ఆ జట్టులో రెండు లోపాలున్నాయి... ముఖ్యంగా సీఎస్‌కే బ్యాటింగ్ ఆర్డర్‌లో సురేష్ రైనాని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది...

47
Dhoni-Raina, Photo Credit CSK

ఎందుకంటే అతను సరైన ఫామ్‌లో లేడు. కాబట్టి టాపార్డర్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్‌లో లోపాలు బయటపడతాయి.. కాబట్టి ఏదో మ్యాచ్‌లో సీఎస్‌కే ఇబ్బందులు పడడం ఖాయం...

57

టాప్ 4 బ్యాట్స్‌మెన్ బాగా ఆడుతున్నారు. అయితే రైనా, ధోనీ సరిగా ఆడాల్సిన అవసరం ఉంది. వాళ్లు పరుగులు సాధిస్తేనే సీఎస్‌కే విజయాలు పరిపూర్ణమవుతాయి...

67

లో స్కోరింగ్ గేమ్స్,‌లో, స్పిన్ పిచ్‌లపైన సురేష్ రైనాని ముందు పంపాలి, అలాగే ధోనీ కూడా టాపార్డర్‌లో రావాలి... వాళ్లు నెమ్మదిగా ఆడుతూ 130 పరుగులు చేసినా, అవి సీఎస్‌కే చాలా అమూల్యంగా మారతాయి...

77

సీఎస్‌కే ఆటతీరు చూస్తుంటే... కేవలం పది మంది ప్లేయర్లతోనే ఆడుతున్నట్టుగా ఉంది. మాహీ వారికి కేవలం కెప్టెన్‌గా మాత్రమే కనిపిస్తున్నాడు. ఆటగాడిగా అతను ఈ సీజన్‌లో ఇప్పటిదాకా కనిపించలేదు.. ’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...

click me!

Recommended Stories