IPL 2021: టీఆర్పీలో అసలైన బిగ్‌బాస్ ఇదే... ఐపీఎల్ 2021 ఫేజ్ 2కి రికార్డు లెవెల్ వ్యూయర్ ‌షిప్...

First Published Sep 30, 2021, 7:38 PM IST

ఇటు నాగార్జున, మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీవీ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’తో వస్తే, అటు ఎన్టీఆర్ ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ అంటూ వచ్చాడు. ఈ రెండు షోలకు ఆరంభంలో మంచి వ్యూయర్‌షిప్ వచ్చింది. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాక, టీఆర్పీలో అసలైన ‘బిగ్‌బాస్’గా నిలిచింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021...

ఐపీఎల్ 2021 సీజన్ మొదలయ్యాక, మిగిలిన టీవీ కార్యక్రమాలకు టీఆర్పీ ఘోరంగా పడిపోయిందట. ఐపీఎల్ మ్యాచులు వచ్చే సమయంలోనే ఎన్టీఆర్ ‘మీలో ఎవరు కోటీశ్వరులు’, నాగ్ ‘బిగ్‌బాస్’ ప్రోగ్రామ్స్ వస్తున్నా... వాటితో పోలిస్తే ప్రీమియర్ లీగ్ మ్యాచులకే టీఆర్పీ అధికంగా వస్తోంది..

ఐపీఎల్ 2020 సీజన్‌తో పోలిస్తే, ఐపీఎల్ 2021లో పెద్దగా మజా లేదు. గత సీజన్‌లో రికార్డు లెవెల్లో సూపర్ ఓవర్ మ్యాచులు, ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన భారీ స్కోరింగ్ మ్యాచులు, ఆఖరి గ్రూప్ మ్యాచ్ వరకూ ప్లేఆఫ్ బెర్తులపై కొనసాగిన సస్పెన్స్...

అలాంటి హై డ్రామా.. ఈ సీజన్‌లో పెద్దగా కనిపించలేదు. లో స్కోరింగ్ గేమ్‌లు, వన్‌సైడెడ్ మ్యాచులే ఎక్కువగా సాగాయి. అందులోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికే తట్టా, బుట్టా సర్దుకుని అస్సాం ట్రైయిన్ కూడా ఎక్కడానికి సిద్ధంగా ఉంది...

అయితే ఐపీఎల్ 2021 సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది... 14వ సీజన్‌లో 35 మ్యాచులు ముగిసేసరికి 380 మిలియన్ల మంది ఐపీఎల్ మ్యాచులను వీక్షించారట... గత సీజన్‌తో పోలిస్తే ఇప్పటికే సూపర్ హిట్ కొట్టింది ఐపీఎల్ 2021...

‘ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఐపీఎల్ 2021 సీజన్ రికార్డు లెవెల్ వ్యూయర్‌షిప్‌తో దూసుకుపోతోంది... 35వ మ్యాచ్ సమయానికి టీవీ వ్యూయర్‌షిప్ 380 మిలియన్లను తాకింది. 2020లో ఈ సమయంలో వచ్చిన వ్యూయర్‌షిప్ కంటే ఇది 12 మిలియన్లు ఎక్కువ.. థ్యాంక్యూ ఎవ్రీ వన్...’ అంటూ ట్వీట్ చేశాడు బీసీసీఐ సెక్రటరీ జే షా...

कार्तिक त्यागी

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా, యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020 సీజన్, గత రికార్డులను అధిగమించి వ్యూయర్‌షిప్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.. ఈ స్పీడ్‌తో దూసుకుపోతే, ఐపీఎల్ 2021 సీజన్ గత రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం...

డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఈ సీజన్‌లో వరుస ఓటములతో ప్లేఆఫ్ బెర్త్ కోసం పోటీలో నిలవడం, సీఎస్‌కే, ఆర్‌సీబీ వంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా జట్లు టాప్‌లో నిలవడం... 2021 సీజన్ సక్సెస్‌ రేటు మరింత పెరగడానికి కారణమని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

click me!