IPL 2021 CSK vs DC: బర్త్ డే బాయ్ పంత్ రికార్డులు... పిన్న వయస్సులోనే సంచలనాలు సృష్టిస్తున్న ఢిల్లీ కెప్టెన్

First Published Oct 4, 2021, 6:16 PM IST

Happy Birthday Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ నేడు 24వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.  అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసిన కొద్దికాలానికే పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. మరికొద్దిసేపట్లో దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్ లో తన గురువు, మెంటార్ అయిన మహేంద్ర సింగ్ ధోని సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడబోతున్నాడు.

భారత జట్టు వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్ ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ జిల్లా రూర్కీలో 1996 అక్టోబర్ 4న జన్మించాడు. ఇవాళ పంత్ 24 వ పడిలోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్ లోనే గాక ఇండియన్ టీమ్ తరఫునా అదరగొడుతున్న ఈ యంగ్ క్రికెటర్ నెలకొల్పిన పలు రికార్డులను ఇక్కడ చూద్దాం. 

భారత్ తరఫున టెస్టుల్లో  వేగంగా వేయి పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ రిషభ్ పంత్.  వేయి పరుగులు చేయడానికి పంత్ కు 27 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి. ఇవే పరుగుల కోసం దోని 32 ఇన్నింగ్స్ ఆడాడు. 

ఒక టెస్టులో అత్యధిక క్యాచ్ లు అందుకున్న కీపర్ గా  పంత్ రికార్డు నెలకొల్పాడు. 2018 19 లో భారత్ జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లగా.. ఒక టెస్టులో పంత్ ఏకంగా 11 క్యాచ్ లు అందుకున్నాడు. ఈ రికార్డు అంతకుముందు ఆర్ సి రస్సెల్, ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. భారత్ తరఫున ఈ రికార్డు పంత్ పేరిటే ఉంది. 

ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించినవారిలో పంత్ రెండో స్థానంలో ఉన్నాడు. 2018లో ఢిల్లీ తరఫున ఆడిన పంత్.. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 128 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన రికార్డు అంతకుముందు కెఎల్ రాహుల్ (132) మీద ఉంది. 

ఐపీఎల్ లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుల (భారత్ నుంచి) జాబితాలో కూడా పంత్ రెండో వాడు. 2018లో సన్ రైజర్స్ పై సెంచరీ చేసే నాటికి పంత్ వయసు 20 ఏండ్లు మాత్రమే. 2009లో ఆర్సీబీ తరఫున ఆడిన మనీష్ పాండే పంత్ కంటే ముందున్నాడు. 

టెస్టు కెరీర్ ను సిక్స్ తో ప్రారంభించిన తొలి భారత క్రికెటర్ రిషభ్ పంత్. 2018లో ఇంగ్లండ్ లోని ట్రెంట్ బ్రిడ్జి లో జరిగిన టెస్టులో అరంగ్రేటం చేసిన పంత్.. తాను ఎదుర్కొన్న రెండో బంతికి సిక్సర్ కొట్టాడు. 

click me!