IPL2021: బాగుందయ్యా మీ బ్యాటింగ్, మంచిగా నిద్రొచ్చేసింది... సన్‌రైజర్స్ బ్యాటింగ్‌పై సెహ్వాగ్ సెటైర్స్...

First Published Oct 4, 2021, 4:21 PM IST

ఒకప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచులు, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించేవి. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, కేన్ విలియంసన్, శిఖర్ ధావన్ వంటి బ్యాట్స్‌మెన్.. ప్రత్యర్థి బౌలర్లపై బౌండరీలతో దాడి చేసేవాళ్లు.. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది..

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ భారాన్ని మోసే డేవిడ్ వార్నర్‌ను తీసి పక్కనబెట్టింది మేనేజ్‌మెంట్. వార్నర్ భాయ్‌ని తప్పించిన తర్వాత కానీ వాళ్లకి తెలిసీరాలేదు జట్టులో అతని ప్రాధాన్యం ఏంటో...

డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో గత ఐదు సీజన్లలో నాలుగు సార్లు ప్లేఆఫ్స్‌‌‌కి అర్హత సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈసారి ఆఖరి స్థానంలో ముగించనుంది... మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచినా ఎలాంటి ఉపయోగం ఉండదు...

ఐపీఎల్ అంటే బంతికి, బ్యాటుకీ మధ్య పోటీ... బౌలర్ బంతి వేసినంత వేగంగా, దాన్ని బౌండరీ బయట పడేయాలని చూస్తాడు బ్యాట్స్‌మెన్... బౌండరీల మోత, సిక్సర్ల వర్షం కురిసే ఐపీఎల్, క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్లు మజాని అందిస్తుంది. అయితే ఈసారి మాత్రం చాలా మ్యాచులు అలా సాగలేదు...

ఫస్టాఫ్‌లో చెన్నైలో జరిగిన మ్యాచులు లో స్కోరింగ్ థ్రిల్లర్స్‌గా మారగా, యూఏఈలోని దుబాయ్‌లో జరిగే మ్యాచుల్లోనూ అదే తీరు కొనసాగుతోంది. ముఖ్యంగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ మరీ నీరసంగా సాగింది...

తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకే పరిమితం కాగా, ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి ఆఖరి ఓవర్ దాకా బ్యాటింగ్ చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

‘సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహాలు ఆరంభించారు. అయితే వాళ్లు క్రీజులోకి వచ్చినంతసేపు పట్టలేదు, పెవిలియన్‌కి వెళ్లడానికి...

ఆ తర్వాత విలియంసన్, ప్రియమ్ గార్డ్ కాసేపు ఆడారు... ఇది స్లో వికెట్, పిచ్ ఎంత నెమ్మదిగా ఉన్నా, వీళ్లు మరీ ఇలా బ్యాటింగ్ చేస్తాడని అస్సలు ఊహించలేదు...

ఆలెడ్రీ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్నాం, ఇక మిగిలిన మ్యాచులు ఆడి ఏం లాభమనే ఆలోచనలో ఉన్నట్టు కనిపించారు సన్‌రైజర్స్ హైదరాబాద్... 

అబ్దుల్ సమద్ వచ్చి మూడు సిక్సర్లు కొట్టాడు. అయితే 25 పరుగులు చేసిన తర్వాత అతను అవుట్ అయ్యాడు. ఇక మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరి ఆట చూస్తే... నిద్రొచ్చేసింది...

వీళ్లు బ్యాట్స్‌మెన్‌గా కంటే స్లిపింగ్ పిల్స్‌గా బాగా పనికొస్తారు... సన్‌రైజర్స్ బ్యాటింగ్ చూస్తూ, ఆఖరి నాలుగు ఓవర్లు మంచిగా నిద్రపోయా... లేచాక తెలిసింది హైదరాబాద్ 20 ఓవర్లలో 115 పరుగులు చేసిందని...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్... 

click me!