IPL2021: ‘గబ్బర్’ ఖాతాలో మరో రికార్డు... టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో అందుకే చోటు దక్కలేదా...

First Published Sep 23, 2021, 3:34 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్. గత సీజన్‌లో 600+ పరుగులు చేసిన శిఖర్ ధావన్, ఐపీఎల్ 2021 సీజన్‌లో ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు...

Shikhar Dhawan-Photo Credit BCCI

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసిన శిఖర్ ధావన్, ఐపీఎల్ 2021 సీజన్‌లో 400+ పరుగులు పూర్తిచేసుకున్నాడు...

ఐపీఎల్‌లో 400+ పరుగులు చేయడం, శిఖర్ ధావన్‌కి వరుసగా ఇది ఆరోసారి. 2016 నుంచి వరుసగా ఐపీఎల్‌లో 400+ పరుగులు చేస్తూ వస్తున్నాడు గబ్బర్...

2016లో 501 పరుగులు చేసిన శిఖర్ ధావన్, 2017లో 479 పరుగులు, 2018లో 497 పరుగులు, 2019లో 521, 2020లో 618 పరుగులు చేశాడు... ఈ ఏడాది 9 మ్యాచుల్లో 422 పరుగులు చేశాడు శిఖర్ ధావన్...

సురేష్ రైనా ఏడు సీజన్లలో (2008 నుంచి 14 వరకూ), డేవిడ్ వార్నర్ (2013 నుంచి 2020 వరకూ) తర్వాత వరుస సీజన్లలో 400+ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు శిఖర్ ధావన్.

డేవిడ్ వార్నర్ ఈ సీజన్‌లో 400+ పరుగులు చేస్తే, వరుసగా 8వ సీజన్‌లోనూ ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడు...

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 400+ పరుగులు చేయడం శిఖర్ ధావన్‌కి ఇది 8వ సారి. సురేష్ రైనా మాత్రమే 9 సార్లు ఈ ఫీట్ సాధించి... గబ్బర్ కంటే ముందున్నాడు. కోహ్లీ, రోహిత్, వార్నర్ ఏడేసి సార్లు ఈ ఫీట్ సాధించారు...

ఇంత నిలకడగా వరుస సీజన్లలో 400+ పరుగులు చేస్తున్నా, శిఖర్ ధావన్‌కి టీ20 వరల్డ్‌కప్‌లో చోటు దక్కకపోవడానికి అతని స్ట్రైయిక్ రేటే ప్రధాన కారణం...

కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లతో పోలిస్తే శిఖర్ ధావన్‌ నిలకడగా రాణిస్తున్నా... వీరికంటే గబ్బర్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తాడు...

Shikhar Dhawan

శిఖర్ ధావన్ క్రీజులో నిలదిక్కుకోవడానికి కాస్త సమయం తీసుకుంటాడు. ఇదే టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో శిఖర్ ధావన్‌కి చోటు దక్కకోవడానికి ప్రధానకారణంగా మారింది...

Shikhar Dhawan

నిజానికి గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోతున్న శిఖర్ ధావన్‌ని, వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి కూడా ఎంపిక చేయకూడదని భావించారట సెలక్టర్లు...

అయితే ఐసీసీ టోర్నీల్లో మంచి రికార్డు ఉన్న శిఖర్ ధావన్‌, వన్డే వరల్డ్‌కప్ జట్టులో తప్పకుండా ఉండాల్సిందేనని సెలక్టర్లతో పట్టుబట్టి మరీ చెప్పాడట విరాట్ కోహ్లీ...

ఈసారి మాత్రం స్ట్రైయిక్ రేటును సాకుగా చూపించడం, శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో గబ్బర్ పర్ఫామెన్స్ మరీ చెప్పుకునే స్థాయిలో లేకపోవడంతో టీ20 వరల్డ్‌కప్‌లో ధావన్‌ ఎంపిక గురించి సెలక్టర్లతో వాదించలేకపోయాడట విరాట్ కోహ్లీ...

click me!