సీఎస్‌కేపై ఢిల్లీ, డీసీపై ఆర్‌సీబీ, ఆర్‌సీబీపై చెన్నై... ప్లేఆఫ్స్ చేరిన జట్ల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్...

First Published Oct 9, 2021, 11:17 AM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో తుది ఘట్టం మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. నెట్‌రన్ రేట్ కారణంగా లక్కగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌, టాప్ 3లో ఉన్న ఆర్‌సీబీతో మొదటి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ముఖ్యంగా ఐపీఎల్‌లో అత్యల్ప స్కోరు 49 పరుగులు కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పైనే నమోదుచేసింది ఆర్‌సీబీ...

కేకేఆర్‌తో మ్యాచ్ అన్నప్పుడల్లా ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ని వెంటాడే భయం ఇదే. ఈ సీజన్‌లోనూ బీభత్సమైన ఫామ్‌లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 92 పరుగులకే పరిమితం చేసింది కేకేఆర్..

93 పరుగుల టార్గెట్‌ను కేవలం 10 ఓవర్లలోనే ఛేదించి అద్భుత విజయం అందుకుంది. అప్పటిదాకా పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న కోల్‌కత్తా కథను మార్చేసిందీ విజయమే...

ఇవన్నీ పక్కనబెడితే టాప్ 3లో ఉన్న మూడు జట్ల మధ్య ఓ అవినాభావ సంబంధం ఉంది. అదెలాగంటే గ్రూప్ స్టేజ్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, రెండో స్థానంలో ఉన్న సీఎస్‌కేని రెండు సార్లు ఓడించింది...
(photo Source- www.iplt20.com)

ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును రెండు సార్లు చిత్తు చేసి, ఘన విజయాలు నమోదుచేసింది...

టేబుల్ టాపర్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఆర్‌సీబీ జోరు ముందు నిలవలేకపోయింది. ఆర్‌సీబీతో జరిగిన మొదటి గ్రూప్ మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో ఓడిన ఢిల్లీ, ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఆఖరి బంతికి పరాజయం పాలైంది...
(Photo source- iplt20.com)

అంటే టేబుల్ టాపర్ ఢిల్లీ, సెకండ్ పొజిషన్‌లో ఉన్న సీఎస్‌కేను రెండుసార్లు ఓడిస్తే, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చెన్నై సూపర్ కింగ్స్, రెండు సార్లు చిత్తు చేసింది...
(Photo source- iplt20.com)

మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్, టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను రెండు మ్యాచుల్లోనూ ఓడించింది. వీటితో పోలిస్తే కేకేఆర్ కథ మాత్రం వేరేగా ఉంది...

ఆర్‌సీబీపై ఓ విజయం, ఓ పరాజయం అందుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్, సీఎస్‌కేపై రెండు మ్యాచుల్లోనూ ఓడింది... ఢిల్లీ క్యాపిటల్స్‌తోనూ మొదటి మ్యాచ్‌లో ఓడిన కేకేఆర్, రెండో మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం అందుకుంది...

click me!