భారత్‌లో ఐపీఎల్ నిర్వహించడానికి కారణం ఇదే... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

First Published May 6, 2021, 1:29 PM IST

ఐపీఎల్ చరిత్రలోనే ఎప్పుడూ లేనట్టుగా 2021 సీజన్‌కి మధ్యలోనే బ్రేకులు వేయాల్సి వచ్చింది. గత సీజన్‌ను యూఏఈలో విజయవంతంగా నిర్వహించిన బీసీసీఐకి, ఈసారి కరోనా ఊహించని షాక్ ఇచ్చింది. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించడానికి కారణాలు ఉన్నాయంటున్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ..

యావత్ భారతాన్ని కరోనా కేసులు ముంచెత్తుతూ, జనాలు ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో వేల కోట్లు ఖర్చు పెట్టి ఐపీఎల్ 2021 సీజన్‌ను భారత్‌లో నిర్వహించడం పలు విమర్శలకు తావిచ్చింది.
undefined
యావత్ భారతాన్ని కరోనా కేసులు ముంచెత్తుతూ, జనాలు ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో వేల కోట్లు ఖర్చు పెట్టి ఐపీఎల్ 2021 సీజన్‌ను భారత్‌లో నిర్వహించడం పలు విమర్శలకు తావిచ్చింది.
undefined
ఆసీస్ క్రికెటర్లు ఆండ్రూ టైతో పాటు చాలా మంది ఐపీఎల్ 2021 సీజన్‌ నిర్వహణను తప్పుబట్టారు. గత ఏడాది భారత్‌లో కరోనా కేసులు భయానక స్థాయిలో పెరుగుతున్నప్పుడు యూఏఈలో ఐపీఎల్ నిర్వహించి, సూపర్ సక్సెస్ అయిన బీసీసీఐకి, ఈ సారి కరోనా వైరస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.
undefined
‘ఐపీఎల్ 2021 సీజన్‌ను ప్రారంభించే సమయానికి దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంత భయానక స్థాయలో లేదు. అప్పటికి దేశంలో కరోనా కేసులు తగ్గుతూ, సినిమా థియేటర్లు, స్టేడియాల్లోకి కూడా జనాలను అనుమతిస్తున్నారు..
undefined
గత నెలలోనే ఇంగ్లాండ్ సిరీస్‌లో కొన్ని మ్యాచులు జనాల మధ్య నిర్వహించి, సక్సెస్ అయ్యాం. అందుకే ఐపీఎల్ 2021 సీజన్‌ను స్వదేశంలో నిర్వహించాలని నిర్ణయించుకున్నాం...
undefined
చాలా మ్యాచులను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయగలిగాం. అయితే బయో బబుల్‌లోకి వైరస్ ఇలా ఎంట్రీ ఇస్తుందని మాత్రం ఊహించలేకపోయాం... మేం ప్లాన్ తయారుచేసుకుని, షెడ్యూల్ రూపొందించినప్పుడు దేశంలో కరోనా కేసులు ఈస్థాయిలో లేవు.
undefined
అందుకే దేశానికి దూరం యూఏఈలో మ్యాచులు నిర్వహించడం కంటే, ఇక్కడ బెటర్ అని ఫిక్స్ అయ్యాం. నిజానికి ఐపీఎల్ ప్రారంభమయ్యాక పరిస్థితిని బట్టి, మ్యాచులకు ప్రేక్షకులను కూడా అనుమతించాలని అనుకున్నాం...
undefined
అయితే మూడు వారాల్లోనే దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ముంబైలో కూడా సక్సెస్‌ఫుల్‌గా మ్యాచులు పూర్తిచేయగలిగాం...
undefined
మా దృష్టికి వచ్చినంతవరకూ ఐపీఎల్ 2021 సీజన్‌లో ఏ ప్లేయర్ కూడా కరోనా ప్రోటోకాల్ బ్రేక్ చేయలేదు. మిగిలిన సీజన్‌ను ఎప్పుడు నిర్ణయించాలనే విషయంపై ఇప్పుడే మాట్లాడదలుచుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...
undefined
అయితే ఐపీఎల్ 2021 సీజన్ ఎక్కడ ఆగిందో, అక్కడి నుంచి మిగిలిన మ్యాచులను సెప్టెంబర్‌లో నిర్వహించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు నేరుగా టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొంటారని సమాచారం...
undefined
click me!