కుర్రాళ్లు కుమ్మేశారు... ఐపీఎల్ 2021 సీజన్‌లో అదరగొట్టిన యంగ్ ప్లేయర్లు వీరే...

First Published May 6, 2021, 12:55 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రధాన ఉద్దేశమే యంగ్ క్రికెటర్లలోని టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయడం. ఐపీఎల్ 2021 సీజన్ మొదటి సగంలో కుర్రాళ్లు అదిరిపోయే పర్ఫామెన్స్‌తో అదరగొట్టారు. అక్కడక్కడా సీనియర్ల మెరుపులు మినహా ఇస్తే, ఈ సీజన్‌లో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లే మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు...

దేవ్‌దత్ పడిక్కల్: గత సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు దేవ్‌దత్ పడిక్కల్. అయితే వేగంగా పరుగులు చేయడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన స్ట్రైయిక్ రేటు 124 మాత్రమే.
undefined
ఈ సీజన్ ఆరంభానికి ముందు విజయ్ హాజారే ట్రోఫీ పర్ఫామెన్స్ ఇచ్చిన ఎనర్జీతో చెలరేగిపోయాడు దేవ్‌దత్ పడిక్కల్. ఓ అద్భుత సెంచరీతో పాటు 195 పరుగులు చేశాడు. స్ట్రైయిక్ రేటు 152 . పడిక్కల్ త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
undefined
రుతురాజ్ గైక్వాడ్: గత సీజన్‌లో ప్లేఆఫ్ అవకాశాలు మూసుకుపోయాక ఎంట్రీ ఇచ్చాడు రుతురాజ్ గైక్వాడ్. గత సీజన్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదిన రుతురాజ్, ఈ సీజన్‌లోనూ తన ఫామ్‌ను కొనసాగించాడు. 7 మ్యాచుల్లో 196 పరుగులు చేసి సీఎస్‌కే విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
undefined
నితీశ్ రాణా: కొన్ని సీజన్లుగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టులో ఓపెనర్‌గా రాణిస్తున్నాడు నితీశ్ రాణా. ఈ సీజన్ ఆరంభంలో కూడా రెండు భారీ హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు నితీశ్ రాణా. అయితే ఆ తర్వాత ఫామ్‌ కోల్పోయి పెద్దగా రాణించలేకపోయాడు.
undefined
రాహుల్ త్రిపాఠి: ఈ సీజన్‌లో ఏడు మ్యాచులు ఆడిన రాహుల్ త్రిపాఠి 187 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఓ హాఫ్ సెంచరీతో రాణించిన త్రిపాఠి, మిగిలిన బ్యాట్స్‌మెన్ జిడ్డాటతో విసిగిస్తున్న వేళ, తేలిగ్గా బౌండరీలు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
undefined
దీపక్ హుడా: ఆరు సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న దీపక్ హుడా, ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లోనే అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగి 64 పరుగులు చేశాడు.
undefined
సీజన్‌లో 8 మ్యాచులు ఆడిన దీపక్ హుడా, 116 పరుగులు చేయడమే కాకుండా 2 వికెట్లు కూడా పడగొట్టాడు. అయితే ఆరంభ మ్యాచుల్లో చూపించిన ఫైర్, ఆ తర్వాతి మ్యాచుల్లో చూపించలేకపోయాడు హుడా..
undefined
షారుక్ ఖాన్: ఐపీఎల్ 2021 వేలంలో రూ.5 కోట్ల 25 లక్షల భారీ ప్రైజ్ దక్కించుకున్న షారుక్ ఖాన్, సీఎస్‌కే జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ చేతుల్లేతేసిన వేళ 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి మంచి హిట్టర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు.
undefined
హర్‌ప్రీత్ బ్రార్: సీజన్‌కి బ్రేకులు పడే సమయానికి సెన్సేషనల్ ప్లేయర్‌గా మారాడు హర్‌ప్రీత్ బ్రార్. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిల్లియర్స్ వంటా వరల్డ్ క్లాస్ ప్లేయర్లను అవుట్ చేసిన బ్రార్,ఆ తర్వాతి మ్యాచ్‌లో పృథ్వీషా వికెట్ తీశాడు.
undefined
రవి బిష్ణోయ్: గత సీజన్‌లో 14 మ్యాచుల్లో 12 వికెట్లు తీసి అదరగొట్టిన 21 ఏళ్ల బిష్ణోయ్, ఈ సీజన్‌లోనూ తన ఫామ్‌ను కొనసాగించాడు. 4 మ్యాచుల్లో 4 వికెట్లు తీసినా... కేవలం 6.18 ఎకానమీతో బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తెగ ఇబ్బంది పెట్టాడు.
undefined
చేతన్ సకారియా: ఈ యంగ్ ప్లేయర్లను రూ.1 కోటి 20 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. మొదటి మ్యాచ్‌లోనే కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌, రిచర్డ్‌సన్‌లను అవుట్ చేసిన సకారియా... ధోనీ, అంబటి రాయుడు, రైనా, నితీశ్ రాణా వికెట్లు పడగొట్టాడు..
undefined
ఆవేశ్ ఖాన్: ఐపీఎల్ 2021 సీజన్‌లో అదరగొట్టన పేసర్లలో ఆవేశ్ ఖాన్ ప్రముఖుడు. ధోనీని డకౌట్ చేసిన ఆవేశ్ ఖాన్, డుప్లిసిస్, బెయిర్ స్టో, విరాట్ కోహ్లీ వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లను అవుట్ చేశాడు. 8 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు.
undefined
హర్షల్ పటేల్: 7 మ్యాచుల్లో 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో టాప్‌లో నిలిచాడు హర్షల్ పటేల్. అయితే హర్షల్ పటేల్ వయసు 30 ఏళ్లు. దేశవాళీ క్రికెట్‌లో హర్యానా జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించే హర్షల్ పటేల్‌కి ఈ సీజన్‌లో మంచి గుర్తింపు దక్కింది.
undefined
షాబజ్ అహ్మద్: ఒకే మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసి అదరగొట్టాడు షాబజ్ అహ్మద్. 5 మ్యాచుల్లో కలిపి 4 వికెట్లు తీసినా కేవలం 6.4 ఎకానమీతో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు అహ్మద్.
undefined
click me!