విరాట్ కోహ్లీ సొంత రెస్టారెంట్ నోయెవా... చూస్తే కళ్లు, ఒళ్లూ జిగిల్ అనాల్సిందే...

First Published Oct 1, 2021, 7:37 PM IST

భారత కెప్టెన్, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి ఆదాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న క్రికెటర్లలో టాప్‌లో నిలిచిన విరాట్ కోహ్లీకి వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి... వాటిల్లో ఢిల్లీలోని నోయెవా పేరుగల లగ్జరీ రెస్టారెంట్ కూడా ఒకటి...

లగ్జరీ లైఫ్‌ని గడిపే విరాట్ కోహ్లీ తన అభిరుచులకు తగ్గట్టే, నోయెవా రెస్టారెంట్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు. ఇక్కడ వసతులు, ఫర్నీచర్, లైటింగ్ చూస్తే... కళ్లు జిగేల్ మనడం ఖాయం...
(photo Source- Google)

ఆర్‌కే పురంలోని సెక్టార్ 9లో ఉన్న నోయెవా రెస్టారెంట్ ద్వారా విరాట్ కోహ్లీ, ఏటా దాదాపు 9 కోట్ల రూపాయాల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.. ఇక్కడ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్‌తో పాటు విదేశీ రుచులు కూడా అందుబాటులో ఉన్నాయి...


నోయెవా రెస్టారెంట్‌లో హెడ్ చెఫ్ మైకెల్ స్వామీ... దేశంలోని టాప్ 50 చెఫ్‌ల్లో ఒకడైన మైకెల్ స్వామీ... కేవలం చెఫ్ మాత్రమే కాకుండా ఫుడ్ అనాలసిస్ట్, రైటర్, ట్రావెల్ ఫోటోగ్రాఫర్ కూడా...
(photo Source- Google)

చైనీస్, ఇటాలియన్, జపనీస్‌ రుచులతో పాటు సౌత్ అమెరికాకి చెందిన స్పెషల్ డిషెస్ కూడా విరాట్ కోహ్లీ నోయెవా రెస్టారెంట్‌తో దొరుకుతాయి...
(photo Source- Google)

ఈ రెస్టారెంట్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో బార్ ఉంటుంది. ఇక్కడ అల్కహాల్ సర్వ్ చేసేందుకు ఇంకా అనుమతులు రాకున్నా... మోక్ టైల్స్ మాత్రం అందుబాటులో ఉన్నాయి...
(photo Source- Google)

దేశంలో అతి తక్కువ రెస్టారెంట్లలో మాత్రమే దొరికే సౌత్ అమెరికా వంటకాలతో పాటు స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్, ఫ్రాన్స్, జపాన్, ఆసియా వంటకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి...

విరాట్ కోహ్లీ స్నేహితులు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లు... ఈ రెస్టారెంట్‌కి చాలా సార్లు వచ్చారు, విరాట్ ఆతిథ్యానికి ఉప్పొంగిపోయారు... ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచులు జరిగే సమయంలో కోహ్లీ టీమ్ మేట్స్ అందరూ దాదాపు ఇక్కడే పార్టీ చేసుకుంటూ ఉంటారట...

click me!