IPL 2021: కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది... ప్లేఆఫ్ రేసులో ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకీ కీలకం కానుంది...
11 మ్యాచుల్లో ఐదు మ్యాచుల్లో గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సెకండాఫ్‌లో అద్భుత విజయాలు అందుకుంటూ టాప్ 4లోకి దూసుకొచ్చింది కేకేఆర్...
26
మరోవైపు పంజాబ్ కింగ్స్ వరుస మ్యాచుల్లో ఓడి, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచుల్లో కూడా ఓడిన పంజాబ్ కింగ్స్, ఈ మ్యాచ్ ఓడితే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది...
36
ఇరుజట్ల మధ్య ఇప్పటిదాకా 28 మ్యాచులు జరగగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 19 మ్యాచుల్లో విజయం అందుకుంది. పంజాబ్ కింగ్స్‌కి 9 మ్యాచుల్లో విజయం దక్కింది...
46
ఫస్టాఫ్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసి 123 పరుగులకు పరిమితం కాగా, కేకేఆర్ ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది...