T20 World Cup: వీళ్లను ఎంపిక చేస్తే బాగుండేదేమో..! ఆ ఐదుగురి ఆట చూసినాక తప్పు తెలుసుకుంటున్న బీసీసీఐ పెద్దలు

First Published Oct 4, 2021, 4:51 PM IST

IPL 2021: ప్లే ఆఫ్స్ దశకు చేరుకున్న ఐపీఎల్ 14 సీజన్ లో పలువురు క్రికెటర్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. అసలు వీళ్లు ఆడుతారా..? అనే స్థితి నుంచి మ్యాచ్ విన్నర్లుగా మారుతున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే మొదలయ్యే టీ20 వరల్డ్ కప్ లో భారత్ జట్టుకు వీళ్లను కూడా ఎంపిక చేసిఉంటే బాగుండేదని సగటు క్రికెట్ అభిమానులే గాక బీసీసీఐ పెద్దలు అనుకుంటున్నారు. 

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో పలు జట్ల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కొందరు ఆటగాళ్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. వీరిలో పలువురు క్రికెటర్లు త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకుంటారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా బీసీసీఐ ప్రకటించిన టీమ్ లో వీళ్లు చోటు దక్కించుకోలేదు. ఐపీఎల్ సెకండ్ ఫేజ్ లో అదరగొడుతున్న  ఐదుగురు క్రికెటర్ల ఆటను చూసి సగటు క్రికెట్ అభిమానులే గాక బోర్డు పెద్దలు వీళ్లను ఎందుకు ఎంపిక చేయలేకపోయాం అని ఫీలవుతున్నారట. వాళ్లెవరంటే...!

ఐపీఎల్ సెకండ్ ఫేజ్ లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడుతున్న యుజ్వేంద్ర చాహల్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్, అవేశ్ ఖాన్ (డీసీ), హర్షల్ పటేల్ (ఆర్సీబీ), రుతురాజ్ గైక్వాడ్ (సీఎస్కే) లు అనూహ్య రీతిలో మెరుస్తున్నారు.  మ్యాచ్ మ్యాచ్ కు మెరుగవుతూ అద్భుత ప్రదర్శనలతో అలరిస్తున్నారు. అయితే వీరిలో ఒక శ్రేయస్ అయ్యర్ మాత్రం స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో ఉండటం గమనార్హం. అయితే టీమ్ ఇండియా లోకి ఎంపికైనా ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ లతో పాటు బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా పెద్దగా ప్రభావం చూపడం లేదు.

శ్రేయస్ అయ్యర్: మిడిలార్డర్ బ్యాట్స్మెన్ గా ఉపయుక్తకరమైన ఇన్నింగ్స్ ఆడే శ్రేయస్.. ఐపీఎల్ కు ముందు గాయపడటంతో అసలు అతన్ని జట్టుకు ఎంపిక చేస్తారా..? అనే అనుమానం ఉండేది. కానీ ఐపీఎల్ లో అయ్యర్ అదరగొడుతున్నాడు. గత నాలుగు మ్యాచుల్లో అతడు అద్భుతంగా రాణించాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో  సంయమనంతో ఆడిన అతడు.. మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. 

యుజ్వేంద్ర చాహల్:  టీమ్ ఇండియా టీ20 జట్టులో స్థానం కోల్పోయిన కసో లేక మరేదైనా కారణమో గానీ సెకండ్ ఫేజ్ లో చాహల్ అదరగొడుతున్నాడు. ఆర్సీబీ గత మూడు మ్యాచులలో అతడు అద్బుత స్పెల్ లు వేశాడు. ఐదు మ్యాచుల్లో పది వికెట్లు తీశాడు. వికెట్లు తీయడమే గాక బౌలింగ్ ఎకానమీ కూడా బాగుంది. స్లాగ్ ఓవర్లలో బ్యాట్స్మెన్ ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 
 

అవేశ్ ఖాన్: ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న అవేశ్ ఖాన్ ఈ సీజన్ లో ఇరగదీస్తున్నాడు. తొలి ఫేజ్ లోనే అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకున్న ఈసారి జట్టులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా అతడికి చోటు దక్కలేదు. 

హర్షల్ పటేల్: ఆర్సీబీ తరఫున ఆడుతున్న హర్షల్.. ఈ సీజన్ లో సంచలన స్పెల్ లు నమోదు చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ తో హ్యాట్రిక్ తో పాటు ఈ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. యూఏఈలోని స్లో వికెట్లపై హర్షల్ లేకపోవడం పెద్ద లోటే. స్లో బంతులు వేయడంలో హర్షల్ పటేల్ స్పెషలిస్టు అన్న సంగతి తెలిసిందే. 

రుతురాజ్ గైక్వాడ్: బ్యాట్ పట్టిందంటే పరుగుల వరద పారిస్తున్న ఈ సీఎస్కే బ్యాట్స్మెన్ భారత జట్టుకు ఎంపికవుతాడని అంతా అనుకున్నారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడికి అవకాశమివ్వలేదు. గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై సెంచరీతో పాటు ఈ సీజన్ లో మొత్తంగా 50.8 సగటుతో 508 పరుగులు చేశాడు. 

click me!