బీఎండబ్ల్యూ కారు.. రొలెక్స్ వాచ్.. అదిరిందయ్యా రాహులూ..! పంజాబ్ కెప్టెన్ లైఫ్ స్టైల్ మాములుగా లేదుగా..

Published : Oct 08, 2021, 04:27 PM ISTUpdated : Oct 08, 2021, 04:29 PM IST

IPL 2021: భారత జట్టు ఓపెనర్, పంజాబ్ సూపర్ కింగ్స్ సారథి కెఎల్ రాహుల్ ఈ సీజన్ లో అత్యంత విజయవంతమైన ఆటగాడు.  ప్రస్తుత సీజన్ లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయిన రాహుల్.. లైఫ్ స్టైల్ రిచ్ గా ఉంటుంది. 

PREV
18
బీఎండబ్ల్యూ కారు.. రొలెక్స్ వాచ్.. అదిరిందయ్యా రాహులూ..!  పంజాబ్ కెప్టెన్ లైఫ్ స్టైల్ మాములుగా లేదుగా..

ఐపీఎల్ లో తాను సారథ్యం వహిస్తున్న Punjab super kingsను Playoffs చేర్చలేకపోయినా ఆటగాడిగా మాత్రం రాహుల్ విఫలమవ్వలేదు. 13 మ్యాచులాడిన రాహుల్.. ఏకంగా 62 సగటుతో 626 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. 

28

ఆట విషయం పక్కనబెడితే ఈ భారత వికెట్ కీపర్  బ్యాట్స్మెన్ లైఫ్ స్టైల్ విషయంలో మాత్రం రిచ్ గా ఉంటాడు. భారత క్రికెట్ బోర్డు నుంచి అత్యధిక ఆదాయం పొందే ఆటగాళ్లలో రాహుల్ కూడా ఉన్నాడు. Bcci నుంచి అతడు ఏటా రూ. 5 కోట్ల ఆదాయం పొందుతున్నాడు. ఒకసారి రాహుల్ లగ్జరీ లైఫ్ గురించి ఇక్కడ చూద్దాం. 

38

కర్నాటక రాజధాని బెంగళూరుకు చెందిన రాహుల్ కు.. ఇక్కడే ఓ భారీ భవంతి ఉంది. అత్యాధునిక సదుపాయాలన్నీ ఇందులో ఉన్నాయి. తన టేస్ట్ కు తగ్గట్టు ఉండేలా అత్యంత ఖరీదైన ఇంటిని నిర్మించుకున్నాడు రాహుల్. 

48

రాహుల్ కు వాచ్ లంటే మక్కువ ఎక్కువ. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అతడు మంచి వాచ్ లను కనిపిస్తే మాత్రం షాపింగ్ చేయకుండా వదలడు. Panerai (రూ. 8 లక్షలు) మొదలుకుని  Audemars Piguet Royal Oak (రూ. 19 లక్షలు),  Rolex (రూ. 27 లక్షలు) , Sky-Dweller Rolex (రూ. 38 లక్షలు) తో పాటు మరిన్ని లగ్జరీ వాచ్ లు అతడి దగ్గరున్నాయి. 

58

ఆఫ్ ది ఫీల్డ్ లో స్టైలిష్ గా కనిపించే రాహుల్ వేసుకునే బట్టలు కూడా అత్యంత ఖరీదైనవే. రాహుల్ వార్డ్  రోబ్ లో Balenciaga tee (రూ. 37,125), Visvim CHRISTO sandals (రూ. 65,925)  PUMA, sneakers వంటి అంతర్జాతీయ బ్రాండ్లున్నాయి. 

68

కుక్కలంటే ఇష్టపడే రాహుల్.. చౌ చౌ అనే కుక్కను పెంచుకుంటున్నాడు. దాని కోసం రోజుకు ఖర్చు వేలల్లోనే ఉంటుందట. 

78

వెకేషన్లంటే చెవి కోసుకునే రాహుల్..  తన క్రికెటింగ్ సహచరులతోనే గాక చిన్ననాటి మిత్రులతోనూ షికార్లకు వెళ్తుంటాడు. భారత జట్టు ఆసీస్, లండన్ పర్యటనలకు వెళ్లినప్పుడు సముద్ర తీరాల వెంబడి వెకేషన్ టూర్స్ కు వెళ్లడంలో రాహుల్ ముందుంటాడు. 

88

రాహుల్ కు కార్లంటే చాలా ఇష్టం. అతడి దగ్గర రూ. 75 లక్షలు విలువ చేసే Mercedes C43 AMG sedan తో పాటు, BMW SUV (రూ. 70 లక్షలు), Lamborghini Huracan Spyder (రూ. 5 కోట్లు), Audi R8 (రూ. 2 కోట్లు), Range Rover Velar, Aston Martin DB11 (రూ. 1 కోటి) వంటి కార్లున్నాయి. 

click me!

Recommended Stories