ఆఖరికి పూజారా కూడా ఐపీఎల్ టైటిల్ గెలిచాడు, కానీ విరాట్ నువ్వు మాత్రం...

First Published Oct 16, 2021, 3:14 PM IST

ఐపీఎల్ 2021 టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. సీఎస్‌కేకి ఇది నాలుగో టైటిల్ కాగా, కేకేఆర్ తృటిలో మూడో టైటిల్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఈ విజయంతో విరాట్ కోహ్లీపై మరోసారి ట్రోలింగ్ వస్తోంది...

భారత టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారాని ఐపీఎల్ 2021 వేలంలో రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

ఐపీఎల్‌లో ఆడించకపోయినా, ఐసీసీ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి ముందు పూజారా కౌంటీ మ్యాచులు ఆడి, ఫిట్‌గా ఉండకుండా ఉండేందుకు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ వేసిన ఎత్తుగడ ఇదనే ఆరోపణలు వచ్చాయి...

చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంతో ఛతేశ్వర్ పూజారా ఖాతాలో కూడా ఐపీఎల్ విన్నింగ్ మెడల్ వచ్చి చేరింది. దీంతో ‘ఆఖరికి పూజారా కూడా ఐపీఎల్ టైటిల్ గెలిచాడు, విరాట్ నువ్వు మాత్రం ఇంకా గెలవలేకపోయావ్...’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు సీఎస్‌కే ఫ్యాన్స్...

2008 నుంచి ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ. గత 9 సీజన్లలో ఆర్‌సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్, ఈ సీజన్‌తో ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు కూడా ప్రకటించాడు.

ఐపీఎల్‌లో ఆడినంత కాలం ఆర్‌సీబీకే ఆడతానని ప్రకటించిన విరాట్ కోహ్లీ, వరుసగా రెండు సీజన్లలో జట్టును ప్లేఆఫ్స్‌కి చేర్చినా... టైటిల్ ఆశలు మాత్రం నెరవేర్చుకోలేకపోయాడు...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి తర్వాతి కెప్టెన్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది... డేవిడ్ వార్నర్ పేరు ఆర్‌సీబీ కెప్టెన్‌ అవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి...

డేవిడ్ వార్నర్‌తో పాటు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్, పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్... ఇలా ఆర్‌సీబీ కెప్టెన్సీ రేసులో చాలామంది ప్లేయర్లే ఉన్నారు... 

ఇదీ చదవండి: కోహ్లీ, రోహిత్, బుమ్రాలకు రెస్ట్... ఆవేశ్, గైక్వాడ్ వంటి కుర్రాళ్లకు ఛాన్స్... కివీస్‌తో టీ20 సిరీస్‌కి...

 సీఎస్‌కే ఊర మాస్ కమ్‌బ్యాక్... గత సీజన్‌లో ప్లేఆఫ్స్ కూడా చేరకుండా, ఈ సీజన్‌లో టైటిల్ గెలిచి...

 IPL2021 Final: తన Ex- టీమ్‌పై కసి చూపించిన ఊతప్ప... అప్పుడు కేకేఆర్ తరుపున ఆడి, ఇప్పుడు సీఎస్‌కేకి...

IPL 2021 Final: ఆ బాల్‌కి సిక్స్ వచ్చుంటే బాగుండు... కెఎల్ రాహుల్, రుతురాజ్‌కీ ఎంత తేడా... 

IPL Final: ధోనీ క్యాచ్ డ్రాప్.. కేబుల్‌కి బాల్ తగలడంలో క్యాచ్ పట్టినా గిల్ నాటౌట్...

click me!