Axar Patel: ఐపీఎల్ పద్నాలుగో సీజన్ లో అదరగొడుతున్న Delhi capitals స్పిన్నర్ అక్షర్ పటేల్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. గత రెండు మ్యాచులలో అద్భుత బౌలింగ్ తో ప్రత్యర్థులను నిలువరించిన పటేల్.. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. గత రెండు మ్యాచులలో Mumbai indians, chennai super kingsతో ఆడిన ఢిల్లీ విజయాలు సాధించడానికి పటేల్ కీలక పాత్ర పోషించాడు.
27
ఈ లెఫ్టార్ట్ స్పిన్నర్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో గత రెండు మ్యాచులకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
37
అయితే ఒక స్పిన్నర్ ఇలా వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు గెలుచుకోవడం 2011 తర్వాత ఇదే తొలిసారి.
47
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ట్విట్టర్ లో ఈ విషయాన్ని పంచుకుంది. పటేల్ ఆనందంగా నవ్వుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. పై విషయాన్ని తెలిపింది.
57
చెన్నైతో మ్యాచ్ లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన అక్షర్.. 18 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతేగాక అంతకుముందు మ్యాచ్ లో భారీ స్కోరు సాధించి ఊపుమీదున్న సీఎస్కే బ్యాట్స్మెన్ ను అద్బుతంగా నిలువరించాడు. దీంతో DHONI నేతృత్వంలోని చెన్నై జట్టు 136 పరుగులకే పరిమితమైంది.
67
ఇక అంతకుముందు మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై కూడా పటేల్ విజృంభించాడు. ఆ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన అతడు.. 21 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు.
77
ఐపీఎల్ లో ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్ లు ఆడి 14 వికెట్లు తీశాడు. ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ లో కూడా అదరగొట్టిన అక్షర్ పటేల్.. త్వరలో జరిగే T20 WorldCup కోసం భారత్ జట్టులో సభ్యుడిగా ఎంపికైన విషయం తెలిసిందే.