IPL2021: అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్, రషీక్ సలాం... కశ్మీరీ కుర్రాళ్ల సక్సెస్ వెనక ఇర్ఫాన్ పఠాన్...

First Published Oct 4, 2021, 5:04 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా ఎంతో మంది కుర్రాళ్లు, టీమిండియాలోకి వచ్చారు. శిఖర్ ధావన్ నుంచి హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, నటరాజన్, వరుణ్ చక్రవర్తి దాకా... చాలామంది భారత జట్టులోకి వచ్చింది, ఐపీఎల్‌ రూటులోనే...

మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే జమ్మూకాశ్మీర్ నుంచి టీమిండియాలోకి, ఐపీఎల్‌లోకి వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువే. పర్వేజ్ రసూల్, అబ్దుల్ సమద్... తాజాగా ఉమ్రాన్ మాలిక్ ఈ లిస్టులో చేరాడు...

అయితే ఐపీఎల్‌లో సక్సెస్ సాధించిన కశ్మీర్ కుర్రాళ్లు ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్‌ల సక్సెస్ వెనక భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఉన్నాడనే విషయం చాలామందికి తెలీదు...

టీమిండియాలో స్టార్ ఆల్‌రౌండర్‌గా ఉన్న ఇర్ఫాన్ పఠాన్, ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోల్పోయాడు. టీమిండియాలో చోటు కోసం దాదాపు 8 ఏళ్లు వేచి చూసి, అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు...

అయితే టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించకముందే సత్తా ఉన్న యువఆటగాళ్లను ప్రోత్సాహించేందుకు క్రికెట్ అకాడమీని ప్రారంభించాడు ఇర్ఫాన్ పఠాన్... 

2013లో హార్ధిక్ పాండ్యాను కొనుగోలు చేయాల్సిందిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌కి సూచించాడు ఇర్ఫాన్ పఠాన్. అయితే వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం పఠాన్ సూచనను పట్టించుకోలేదు...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో అద్భుతంగా రాణిస్తూ, ఫ్యూచర్ ఆల్‌రౌండర్‌గా కనిపిస్తున్నాడు అబ్దుల్ సమద్. అబ్దుల్ సమద్‌లోని టాలెంట్‌ని గుర్తించి, అతనికి తగిన శిక్షణ ఇచ్చి రాటుతేలేలా చేసింది ఇర్ఫాన్ పఠాన్...

తన మెంటర్ ఇర్ఫాన్ పఠాన్‌లోనే అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తున్న అబ్దుల్ సమద్, ముంబై ఇండియన్స్ లాంటి జట్టులో ఉండి ఉంటే, ఈపాటికి భారత జట్టులోకి రావడానికి సిద్ధమయ్యేవాడే...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 150+ కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు మరో కశ్మీరీ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్... ఈ సీజన్‌లో అత్యధిక వేగంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్ ఉమ్రాన్...

నటరాజన్ కరోనా కారణంగా జట్టుకి దూరం కావడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్ కూడా ఇర్ఫాన్ పఠాన్ గుర్తించి, రాటుతేల్చిన రత్నమే...

2019 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన జమ్మూ కశ్మీర్ బౌలర్ రషీక్ సలాం... 17 ఏళ్ల 353 వయసులో ఎంట్రీ ఇచ్చి, ముంబై ఇండియన్స్ తరుపున ఆరంగ్రేటం చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు రషీక్...

ఒకే ఐపీఎల్ మ్యాచ్ ఆడిన రషీక్ సలాం... తన పుట్టినరోజు సర్టిఫికెట్‌లో తప్పులు చూపించాడని నిరూపితం కావడంతో అతనిపై ఏడాది నిషేధం విధించింది బీసీసీఐ. అయితే సత్తా ఉన్న క్రికెటర్‌గా గుర్తింపు పొందిన రషీక్, త్వరలో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు...

click me!