IPL 2021 CSK vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ ‘థ్రిల్లింగ్’ విన్... టాప్‌లోకి రిషబ్ పంత్ టీమ్...

First Published Oct 4, 2021, 11:12 PM IST

137 పరుగుల టార్గెట్... బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఈ మాత్రం స్కోరు ఏ మూలకి సరిపోదని అనుకున్నారంతా. అయితే సీఎస్‌కే బౌలర్లు అదిరిపోయే పర్ఫామెన్స్‌ కారణంగా మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ సాగింది... ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, టేబుల్ టాపర్‌గా నిలిచింది...

12 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన పృథ్వీషా, దీపక్ చాహార్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...

ఆ తర్వాత 7 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసిన శ్రేయాస్ అయ్యర్, జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కి క్యాచ ఇచ్చి అవుట్ అయ్యాడు...

12 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్స్‌తో 15 పరుగులు చేసిన రిషబ్ పంత్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 71 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ, ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది..

తొలి మ్యాచ్ ఆడుతున్న రిపల్ పటేల్ 20 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అశ్విన్ 2 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు..

దీపక్ చాహార్ వేసిన ఓవర్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 21 పరుగులు రాబట్టిన శిఖర్ ధావన్... 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

99 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్.. ఆ తర్వాత బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ ఉత్కంఠభరితంగా సాగింది మ్యాచ్...

10 బంతుల్లో 15 పరుగులు కావాల్సిన దశలో  సిక్సర్ బాదిన హెట్మయర్, ఆ తర్వాత రెండు బంతుల్లో 3 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లో 6 పరుగులు కావాల్సి ఉండగా మొదటి బంతికి 2 పరుగులు వచ్చాయి. 

తర్వాతి బంతి వైడ్‌గా వెళ్లగా హెట్మయర్ రన్ తీశాడు. ఆ తర్వాతి బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతికి అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు... 3 బంతుల్లో 2 పరుగులు కావాల్సిన దశలో బౌండరీ బాదిన రబాడా మ్యాచ్‌ని ముగించాడు...

click me!