IPL2021 SRH vs CSK: టాస్ గెలిచిన ఎమ్మెస్ ధోనీ... టేబుల్ టాపర్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్...

Published : Sep 30, 2021, 07:08 PM IST

ఐపీఎల్ 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు... సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేయనుంది...

PREV
16
IPL2021 SRH vs CSK: టాస్ గెలిచిన ఎమ్మెస్ ధోనీ... టేబుల్ టాపర్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్...

పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈ సీజన్‌లో చాలా గ్యాప్ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో విజయాన్ని అందుకుంది...

26

ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలు దూరమైనా, మిణుకు మిణుకుమంటూ ఉన్న ఆ ఒక్క శాతం ఆశలు సజీవంగా ఉండాలంటే నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయాన్ని అందుకోవాల్సి ఉంటుంది...

36

ఇప్పటికే ప్లేఆఫ్‌కి అతి చేరువైన చెన్నై సూపర్ కింగ్స్, ఈ మ్యాచ్‌లో గెలిస్తే మిగిలిన జట్లతో ఎలాంటి సంబంధం లేకుండా బెర్తు కన్ఫార్మ్ చేసుకుంటుంది.. గత సీజన్‌లో ప్లేఆఫ్ నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టు సీఎస్‌కే కావడం విశేషం...

46

పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి మెరుపులు కనిపించకపోవడం మాహీ ఫ్యాన్స్‌ను తీవ్రనిరాశకు గురి చేస్తోంది.. ఈ మ్యాచ్‌లో అయినా మాహీ సిక్సర్ల మోత మోగిస్తాడని ఆశిస్తున్నారు ధోనీ ఫ్యాన్స్...

56

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లిసిస్, మొయిన్ ఆలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎమ్మెస్ ధోనీ, జడేజా, బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, జోష్ హజల్‌వుడ్ 

66

 

సన్‌రైజర్స్ హైదరాబాద్: జాసన్ రాయ్, సాహా, విలియంసన్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ.

click me!

Recommended Stories