IPL2021: ఈ ఐపీఎల్ స్టార్ల సాలరీ ఎంతో తెలుసా..? టాప్ లో ఉన్నది కోహ్లినే

First Published Oct 11, 2021, 2:06 PM IST

IPL Players Salaries: ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన  క్రికెట్ బోర్డుగా గుర్తింపు పొందిన బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ లో సాధారణ ఆటగాళ్లకు ఇచ్చే మొత్తాల గురించి అందరికీ తెలిసిందే. అయితే కెప్టెన్లు, ముఖ్య ఆటగాళ్లకు ఇచ్చే జీతాల గురించి మాత్రం చాలా మందికి తెలియదు. ఆ రహస్యం ఇప్పుడు బట్టబయలైంది. 

క్యాష్ రిచ్ లీగ్ గా పేరొందిన ఐపీఎల్ లో ఫ్రాంచైజీలు క్రికెటర్లకు భారీ  మొత్తంలోనే డబ్బులు ముట్టజెప్పుతున్నాయి. అయితే జట్టులోకి వచ్చే పోయే ఆటగాళ్లకు కాకుండా ఎప్పుడూ టీమ్ తో ఉండే ఆటగాళ్లకు ఎంతిస్తారో మాత్రం రహస్యంగా ఉంచుతాయి. అలా ఏండ్ల పాటు ఒకే టీమ్ తో ఉన్న విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్ వంటి వాళ్లు యేటా ఎంత సంపాదిస్తారో ఇక్కడ చూద్దాం. 

విరాట్ కోహ్లి: ఐపీఎల్ ఆరంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరకు ఆడుతున్న Virat Kohliకి ఆ జట్టు యాజమాన్యం ప్రతి యేటా రూ. 17 కోట్లు ఇస్తున్నది. 

మహేంద్ర సింగ్ ధోని: చెన్నై సూపర్ కింగ్స్ సారథి MS Dhoniకి ఐపీఎల్ సాలరీ రూ. 15 కోట్లు. CSKకి ధోనికి విడదీయరాని అనుబంధం. వచ్చే ఏడాది ధోని.. సీఎస్కేకు ఆడతాడా..? లేదా..? అన్నది సందేహంగా మారింది. 

రోహిత్ శర్మ: ముంబై ఇండియన్స్ కు ఐదు సార్లు కప్ అందించిన ఆ జట్టు సారథి Rohit Sharma  జీతం కూడా రూ. 15 కోట్లు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన MI.. ఈసారి ప్లే ఆఫ్స్ చేరకుండానే  వెనుదిరుగుతున్నది. 

సురేశ్ రైనా: భారత మాజీ మిడిలార్డర్ ఆటగాడు, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న  సురేశ్ రైనా కు  ఆ జట్టు యాజమాన్యం ప్రతి ఏటా రూ. 11 కోట్లు చెల్లిస్తున్నది. కానీ వచ్చే ఏడాది అతడిని స్వస్తి పలకాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. 

ఏబీ డివిలియర్స్ : దక్షిణాఫ్రికా ఆటగాడు, మిస్టర్ 360 గా పేరున్న డివిలియర్స్ కూడా చాలాకాలంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే  ఆడుతున్నాడు. ఏబీ సాలరీ రూ. 15 కోట్లు.

హర్ధిక్ పాండ్యా: 2015 నుంచి ముంబై తరఫున ఆడుతున్న పాండ్యా.. తొలుత  కనీస ధర రూ. 10 లక్షలకు అమ్ముడుపోయాడు. కానీ 2017 తర్వాత అతడి విలువ పెరిగింది. ప్రస్తుతం ముంబై అతడికి  రూ. 11 కోట్లు చెల్లిస్తున్నది. 

click me!