CSK vs DC: మహీ ఇక చాలు, ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకో... ధోనీ ఇన్నింగ్స్‌పై విపరీతమైన ట్రోలింగ్...

First Published Oct 4, 2021, 11:33 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో మాహీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ దారుణమైన పర్ఫామెన్స్ ఇస్తే, ఈసారి టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టింది... అయితే ఈసారి ధోనీ బ్యాట్స్‌మెన్‌గా దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు...

ఐపీఎల్ 2020 సీజన్‌లో ప్లేఆఫ్ నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ఈసారి ప్లేఆఫ్స్‌కి చేరిన మొట్టమొదటి జట్టుగా నిలిచి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది...
(photo Source- www.iplt20.com)

అయితే సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం బ్యాటింగ్‌లో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు... ఈ సీజన్‌లో 10 ఇన్నింగ్స్‌లు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, 14 సగటుతో 84 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో విజయానికి 3 పరుగులు కావాల్సిన దశలో సిక్సర్ బాది ముగించిన ఎమ్మెస్ ధోనీ... ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించాడు...

27 బంతుల్లో 18 పరుగులు చేసిన మహేంద్ర సింగ్... తన ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. ఐపీఎల్‌లో 20+కి పైగా బంతులు ఆడి బౌండరీ కొట్టలేకపోవడం, మాహీకి ఇది నాలుగోసారి...

కేవలం సన్‌రైజర్స్ హైదరాబాద్ మణిరత్నం మనీశ్ పాండే మాత్రమే ఐపీఎల్‌లో ఐదుసార్లు ఒక్క బౌండరీ కూడా లేకుండా 20కి పైగా బంతులు ఆడి టాప్‌లో ఉన్నాడు...

రవీంద్ర జడేజా ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. మొదటి నాలుగైదు బంతుల తర్వాత బౌలర్‌ ఎవరనేది కూడా పట్టించుకోకుండా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు...

Dhoni-Raina, Photo Credit CSK

అలాంటి జడ్డూని పంపించాల్సిన పొజిషన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌కి వచ్చాడు. ఓ వైపు అంబటి రాయుడు బౌండరీల మోత మోగిస్తూ ఉంటే, బంతులను మింగేస్తూ సింగిల్స్ తీశాడు...

మాహీ జిడ్డు బ్యాటింగ్ వల్లే, చెన్నై సూపర్ కింగ్స్‌ ఓటమి పాలైందని అంటున్నారు కొందరు సీఎస్‌కే ఫ్యాన్స్... గత సీజన్‌లో మాహీ కెప్టెన్సీని ట్రోల్ చేసిన ఫ్యాన్స్, ఇప్పుడు అతని బ్యాటింగ్‌ను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ మొదలెట్టారు...
(Photo source- Instagram)

మాహేంద్ర సింగ్ ధోనీ ఆడిన నాలుగున్నర ఓవర్లలో ఒక్క బౌండరీ అయినా బాది ఉంటే, మ్యాచ్ రిజల్ట్ మరోలా ఉండి ఉండేదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

‘సీఎస్‌కేకి ధోనీ కమ్‌బ్యాక్ ఫామ్ చాలా అవసరం. లేదంటే వాళ్లు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది...ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓడించాలంటే అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉండాల్సిందే...’ అంటూ ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్...

click me!