MIvsDC: తిప్పేసిన అమిత్ మిశ్రా... మరోసారి ముంబై బ్యాట్స్‌మెన్ ఫెయిల్...

First Published Apr 20, 2021, 9:20 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో విజయాలు దక్కుతున్నా, ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ వైఫల్యం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకనొక దశలో 6.5 ఓవర్లలో 67/1 పరుగులతో ఈజీగా 200 కొట్టేలా కనిపించిన ముంబై ఇండియన్స్, వరుస వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కి శుభారం దక్కలేదు. మూడో ఓవర్‌ తొలి బంతికే డి కాక్‌ను అవుట్ చేసి, తొలి షాక్ ఇచ్చాడు స్టోయినిస్...
undefined
అయితే సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ కలిసి రెండో వికెట్‌కి 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరూ బౌండరీల మోగ మోగించడంతో 7 ఓవర్లలో 67 పరుగులు చేసింది ముంబై.
undefined
అయితే 15 బంతుల్లో 4 ఫోర్లతో 24 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
undefined
30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.అదే ఓవర్‌లో హార్ధిక్ పాండ్యాను గోల్డెన్ డకౌట్ చేసిన అమిత్ మిశ్రా... ముంబైకి కోలుకోలేని దెబ్బ తీశాడు.
undefined
కృనాల్ పాండ్యా 1 పరుగు చేసి లలిత్ యాదవ్ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా, డేంజరస్ మ్యాన్ కిరన్ పోలార్డ్‌ 2 పరుగులు చేసి మిశ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.
undefined
ఆ తర్వాత 28 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ను కూడా బౌల్డ్ చేశాడు అమిత్ మిశ్రా. ఆ తర్వాత 22 బంతుల్లో 23 పరుగులు చేసిన జయంత్ యాదవ్, రబాడా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
undefined
6 బంతుల్లో 6 పరుగులు చేసిన రాహుల్ చాహార్, 20వ ఓవర్‌లో అవుట్ చేశాడు ఆవేశ్ ఖాన్. మిశ్రా 4 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్‌పై అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన ఢిల్లీ బౌలర్‌గా నిలిచాడు.
undefined
click me!