బుమ్రాలో ఉన్న ఆ క్వాలిటీ, భువనేశ్వర్ కుమార్‌లో లేదు, అందుకే... విండీస్ లెజెండ్ కామెంట్...

Published : Apr 20, 2021, 07:53 PM IST

టీమిండియాలో జస్ప్రిత్ బుమ్రాకి దక్కిన గౌరవం, భువనేశ్వర్ కుమార్‌కి దక్కడం లేదన్నది అందరికీ తెలిసిన విషయం. ఇద్దరిలో ఎవరు బెస్ట్? అనే చర్చ చాలారోజులుగా సాగుతూనే ఉంది. భువనేశ్వర్ కుమార్ అండర్‌రేటెడ్, బుమ్రా ఓవర్ రేటెడ్‌ అనే ట్రోల్స్ కూడా వినిపిస్తూనే ఉన్నాయి...

PREV
111
బుమ్రాలో ఉన్న ఆ క్వాలిటీ, భువనేశ్వర్ కుమార్‌లో లేదు, అందుకే...  విండీస్ లెజెండ్ కామెంట్...

భువనేశ్వర్ కుమార్ గాయపడితే జట్టులోకి వచ్చిన బుమ్రా, టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో విరాట్, రోహిత్ తర్వాత A+ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. భారత జట్టులో నెం.1 స్టార్ పేసర్‌గా ఉన్నాడు.

211

భువనేశ్వర్ కుమార్ మాత్రం గాయాలతో సతమతమవుతున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయపడిన భువనేశ్వర్ కుమార్, మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి మూడు నెలల సమయం తీసుకున్నాడు... 

311

రీఎంట్రీతోనే అదరగొట్టిన భువీ, ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు. ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్- మార్చి’ అవార్డు కూడా గెలుచుకున్నాడు...

411

‘బుమ్రా, భువనేశ్వర్‌ ఇద్దరూ టీమిండియాకు కీలకమైన ప్లేయర్లే. కానీ మూడు ఫార్మాట్లలో బుమ్రానే స్టార్. అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన తర్వాత ఒకనొక దశలో ఫామ్‌ కోల్పోయిన రిథమ్ అందుకోగలిగాడు బుమ్రా...

511

ఏ బౌలర్‌కైనా ఇది చాలా కీలకం... ఒకే విధంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు వికెట్లు పడకపోతే, వికెట్లు పడేలా ఎలా బౌలింగ్ చేయాలో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా మలుచుకోవాలి...

611

యార్కర్లు వేయడం బుమ్రా స్పెషాలిటీ. అయితే ఏ బ్యాట్స్‌మెన్‌కి ఎలాంటి బంతులు వేయాలో అర్థం చేసుకుని, బౌలింగ్ చేయడమే అతన్ని స్టార్ బౌలర్‌ని చేసింది...

711

భువనేశ్వర్ కుమార్ కూడా బుమ్రాతో పోల్చదగినవాడే. కానీ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కంట్రోల్ ఉండదు. బలంగా వేస్తే, వికెట్ పడుతుందనే ప్రయత్నం భువీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అన్నిసార్లు ఇది ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు...’ అంటూ చెప్పుకొచ్చాడు విండీస్ మాజీ పేసర్ ఇయాన్ బిషప్...

811

అయితే ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు సీజన్లలో పర్పుల్ క్యాప్ గెలిచిన ఏకైక పేసర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు భువనేశ్వర్ కుమార్... బుమ్రా మాత్రం ఇప్పటిదాకా పర్పుల్ క్యాప్ సాధించలేకపోయాడు.

911

గత సీజన్‌లో 14 మ్యాచుల్లో 27 వికెట్లతో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చినా, 16 మ్యాచుల్లో 30 వికెట్లు తీసిన కగిసో రబాడాకి పర్పుల్ క్యాప్ దక్కిన విషయం తెలిసిందే. బుమ్రా, సన్‌రైజర్స్‌తో ఆఖరి మ్యాచ్ ఆడి ఉంటే, పర్పుల్ క్యాప్ సాధించేవాడే...

1011

సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బుమ్రా స్టార్ పర్ఫామర్‌గా నిలవగా, భువనేశ్వర్ కుమార్ విఫలమయ్యాడు...

1111

బుమ్రా 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి, ఓ వికెట్ తీయగా... భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో ఏకంగా 45 పరుగులు సమర్పించుకున్నాడు. భువీ వేసిన ఆఖరి ఓవర్‌లో పోలార్డ్ రెండు భారీ సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే.

click me!

Recommended Stories