స్పిన్నర్‌కి మంచి కెప్టెన్ అవసరం, ఇంతకంటే ఇంకేం చేయాలి... అమిత్ మిశ్రా కామెంట్...

First Published Apr 20, 2021, 8:42 PM IST

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ, స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాల వికెట్ తీసిన అమిత్ మిశ్రా, డేంజరస్ మ్యాన్ పోలార్డ్‌ను కూడా అవుట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఉన్నాడు అమిత్ మిశ్రా. ఐపీఎల్‌లో సక్సెస్ అవుతున్నప్పటికీ, మిశ్రాకి తగినన్ని అవకాశాలు మాత్రం దక్కడం లేదు.

ఐపీఎల్‌ కెరీర్‌లో 162 వికెట్లు తీసిన అమిత్ మిశ్రా, లసిత్ మలింగ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. అయితే ఈ సీజన్‌లో రెండు మ్యాచుల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు ఈ 38 ఏళ్ల సీనియర్ లెగ్ స్పిన్నర్...
undefined
‘ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్‌ని నేనే. అయితే టీమిండియాలో రాణించడానికి నాకు తగినన్ని అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాలను నేరుగా సరిగ్గా వినియోగించుకోలేదేమో తెలీదు...
undefined
అయినా నాపైన వచ్చే విమర్శల గురించి నేను పట్టించుకోను. నేను సాధించిన దానితో సంతృప్తి చెందుతున్నా. క్రికెట్ వరల్డ్‌లో ఐపీఎల్ చాలా పెద్ద మెగా టోర్నీ. ఆ మెగా టోర్నీలో బెస్ట్ ఇండియన్ బౌలర్‌ని నేను... ఇంతకంటే ఏం సాధించాలి...
undefined
క్రీజులోకి వచ్చానంటే వికెట్లు తీయడమే నా పని. క్రికెట్ మీద ఉన్న ఇష్టంతో బౌలర్‌ని అయ్యా. నా శరీరం సహకరించినంత కాలం క్రికెట్ ఆడాలని అనుకుంటున్నా...
undefined
లెగ్ స్పిన్నర్‌కి మంచి కెప్టెన్ చాలా అవసరం. పేసర్లలా స్పిన్నర్లు వెంటనే వికెట్లు తీయలేరు. పరుగులు ఇచ్చినా, సహకరించి బౌలింగ్ ఇచ్చే కెప్టెన్ కావాలి...
undefined
కెప్టెన్ నమ్మితేనే, ఏ బౌలర్ అయినా వికెట్లు తీయగలడు... నేను ఆడలేకపోయినా, ఇప్పుడు టీమిండియాకు చాలామంది మంచి స్పిన్నర్లు దొరికారు. తర్వాతి తరంలో కూడా ఇలాగే వస్తారు...’ అంటూ చెప్పుకొచ్చాడు అమిత్ మిశ్రా...
undefined
టీమిండియా తరుపున 22 టెస్టులు ఆడిన అమిత్ మిశ్రా, 76 వికెట్లు తీశాడు. 36 వన్డేల్లో 64 వికెట్లు తీసిన మిశ్రా, 8 టీ20 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టాడు.
undefined
2002లో టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నా, టెస్టు ఆరంగ్రేటం చేసేందుకు 2008 దాకా ఎదురుచూశాడు అమిత్ మిశ్రాం. అనిల్ కుంబ్లే గాయపడడంతో జట్టులోకి వచ్చిన మిశ్రా, మొదటి మ్యాచ్‌లోనే 5 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
undefined
అయితే వికెట్లు తీస్తున్నా హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే పర్ఫామెన్స్ కారణంగా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు అమిత్ మిశ్రా.చివరిసారిగా 2016లో టెస్టు మ్యాచ్ ఆడిన అమిత్ మిశ్రా, 2017 ఫిబ్రవరిలో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు.
undefined
click me!