IPL2021: అంబటి రాయుడి అదిరిపోయే లవ్‌స్టోరీ... ప్రేమికుల రోజునే....

First Published Sep 23, 2021, 8:05 PM IST

భారత క్రికెటర్లలో అంబటి రాయుడి కథ వేరేగా ఉంటుంది. టాలెంట్, పర్ఫామెన్స్ అన్నీ కరెక్టుగా ఉన్నా, కూసింత అదృష్టం కలిసిరాక స్టార్‌ క్రికెటర్‌గా ఎదగలేక, టీమిండియాకి దూరమయ్యాడు అంబటి రాయుడు. అంబి రాయుడి 36వ పుట్టినరోజు నేడు...

1985, సెప్టెంబర్ 23న ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లాలో జన్మించిన అంబటి రాయుడు, 2013లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా టీమిండియాకి ఎంట్రీ ఇచ్చాడు...

97 ఫస్ట్ క్లాస్ మ్యాచులు, 167 లిస్ట్ ఏ మ్యాచులు ఆడిన అంబటి రాయుడు, టీమిండియా తరుపున 55 వన్డేలు, 6 టీ20 మ్యాచులు మాత్రమే ఆడగలిగాడు...

2015 వన్డే వరల్డ్‌కప్ ఆడిన భారత జట్టుకి ఎంపికైన అంబటిరాయుడు, ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. అయితే అంబటి రాయుడి కెరీర్ ఆసాంతం అనేక వివాదాలు వెంటాడాయి...

2012 ఐపీఎల్‌లో ముంబై తరుపున ఆడిన అంబటి రాయుడు, హర్షల్ పటేల్‌ని బూతులు తిట్టడం అప్పట్లో పెను సంచలనానికి దారి తీసింది...

2014లో ఇండియా ఏ, ఆస్ట్రేలియా టూర్‌లో అంపైర్‌తో గొడవపడిన అంబటి రాయుడు, 2016 ఐపీఎల్‌లో తన టీమ్ మేట్ హర్భజన్ సింగ్‌తోనే గొడవపడ్డాడు...

2018 సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో అంపైర్లతో గొడవపడి, రెండు మ్యాచుల నిషేధానికి గురైన అంబటి రాయుడు, 2019 వన్డే వరల్డ్‌కప్‌లో చోటు దక్కకపోవడంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన తీరు హాట్ టాపిక్ అయ్యింది...

తన స్థానంలో విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అంబటి రాయుడు, టీమిండియా మ్యాచులు చూసేందుకు ‘త్రీడీ గ్లాసెస్ ఆర్డర్’ చేశానంటూ ట్వీట్ చేయడం పెను దుమారం రేపింది...

ఆన్ ఫీల్డ్‌లో ఎంతో ఆవేశంగా, టెంపర్ కోల్పోయే అంబటి రాయుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంటే నమ్మకం కూసింత కష్టమే... అయితే అతని వ్యక్తిగత జీవితం మాత్రం పూర్తిగా డిఫరెంట్...

అంబటి రాయుడు, తనతో పాటు కాలేజీలో చదువుకున్న చెన్నుపల్లి విద్యను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు.. వీరిద్దరి వివాహం 2009లో ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) జరిగింది...

11 ఏళ్ల వీరి వివాహబంధానికి గుర్తుగా అంబటిరాయుడు, విద్యాలకు ఓ కూతురు ఉంది. తన కూతురికి వివియ రాయుడు అని నామకరణం చేశాడు అంబటి రాయుడు...

సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టీవ్‌గా ఉంటే అంబడి రాయుడి భార్య విద్య... మిగిలిన క్రికెటర్ల భార్యలకు భిన్నంగా గ్లామర్‌కి దూరంగా, ఎంతో సంప్రదాయబద్ధంగా ఉంటుంది...

2019 వన్డే వరల్డ్‌కప్‌కి ఎంపిక కాకపోవడంతో అసహనానికి గురైన అంబటి రాయుడు, అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...

అయితే ఆవేశంలో తీసుకున్న తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు అంబటి రాయుడు. అయితే ఆ సంఘటన తర్వాత అంబటిరాయుడికి మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు రాలేదు..

click me!