IPL 2020: భువనేశ్వర్ స్థానంలో మన తెలుగు కుర్రాడు... ఎవరీ పృథ్వీరాజ్...

First Published Oct 6, 2020, 3:30 PM IST

IPL 2020 సీజన్‌ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ తప్పుకున్న విషయం తెలిసిందే. భువీ స్థానంలో తెలుగు కుర్రాడు, 22 ఏళ్ల పృథ్వీరాజ్ ఎర్రాను ఎంపిక చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఎవరీ పృథ్వీరాజ్... భువీ స్థానాన్ని పృథ్వీ భర్తీ చేయగలడా?

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18వ ఓవర్‌లో ఒకే ఒక్క బంతి వేసిన భువీ, ఆ తర్వాతి బంతి వేయడానికి ఇబ్బంది పడ్డాడు.
undefined
ఫిజియో చికిత్స తర్వాత కూడా బంతి వేయలేక... పెవిలియన్ చేరాడు.
undefined
అతని స్థానంలో ఖలీల్ అహ్మద్ మిగిలిన 5 బంతులు వేసిన సంగతి తెలిసిందే.
undefined
భువీ నడుముకి అయిన గాయం మానడానికి చాలా సమయం పడుతుందని తెలిపారు వైద్యులు.
undefined
భువీ స్థానంలో సన్‌రైజర్స్ జట్టులో తెలుగు కుర్రాడు పృథ్వీరాజ్ ఎర్రా చోటు దక్కించుకున్నాడు.
undefined
22 ఏళ్ల పృథ్వీరాజ్ విశాఖపట్నానికి చెందిన వాడు... గత సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున రెండు మ్యాచులు కూడా ఆడాడు పృథ్వీరాజ్...
undefined
150కి.మీ.ల మెరుపు వేగంతో బంతులు వేసే పృథ్వీరాజ్... విజయ్ హాజరే ట్రోఫీలో మంచి ప్రదర్శన ఇచ్చాడు.
undefined
ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సర్ అంటే ఇష్టపడే పృథ్వీరాజ్... విరాట్ కోహ్లీని ఒక్కసారైనా అవుట్ చేయాలని కసితో ఉన్నాడు.
undefined
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 6 మ్యాచులాడి 21 వికెట్లు తీసిన పృథ్వీరాజ్ ఎక్రా... లిస్టు ఏ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌ ఆడి 2 వికెట్లు తీశాడు.
undefined
ఇప్పటిదాకా 3 టీ20 మ్యాచ్‌లు ఆడిన పృథ్వీరాజ్ ఎర్రా... 4 వికెట్లు తీశాడు.
undefined
click me!