IPL 2020: ధోనీ చెప్పింది నిజమే... ఈ కుర్రాళ్లలో అది లేదు...

First Published Oct 23, 2020, 10:43 PM IST

IPL 2020 సీజన్‌లో ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు రోజురోజుకీ మరింతగా దిగజారుతోంది. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. యంగ్ ప్లేయర్లకి అవకాశం ఇవ్వడం లేదని సీఎస్‌కే సారథిపై విమర్శలు వచ్చాయి. ‘యంగ్ ప్లేయర్లలో తనకి స్పార్క్ కనిపించలేదని, అందుకే వారిని ఆడించడం లేదని’ ధోనీ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి.

తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యంగ్ ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, జగదీశన్‌లకి అవకాశం ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ..
undefined
తన చిరకాల స్నేహితులు కేదార్ జాదవ్, షేన్ వాట్సన్‌లను తప్పించి, జగదీశన్‌, రుతురాజ్‌లను జట్టులోకి తీసుకొచ్చాడు...
undefined
అయితే రాకరాక వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయిన గైక్వాడ్, జగదీశన్ ఇద్దరూ డకౌట్‌లుగా వెనుదిరిగారు..
undefined
దీంతో ధోని చెప్పిన మాట నిజమేనని, కుర్రాళ్లలో స్పార్క్ ఏ మాత్రం లేదని, ఈ స్థానంలో జాదవ్ ఆడి ఉన్నా 10 బంతులు ఆడి మూడో, నాలుగో పరుగులు చేసి ఉండేవాడని అంటున్నారు సీఎస్‌కే అభిమానులు...
undefined
అయితే ధోనీ యంగ్ స్టార్లపై చేసిన కామెంట్లు, వారిని మానసిక ఒత్తిడిలోకి పడేశాయని... వారి కాన్ఫిడెన్స్‌ దెబ్బతినడం వల్లే ఈరకంగా ఆడారని అంటున్నారు కొందరు నెటిజన్లు...
undefined
అవకాశం ఇచ్చిన మొదటి మ్యాచ్‌లో సత్తా చాటాలని అనుకుంటే, మహేంద్ర సింగ్ ధోనీ ఇక్కడ ఉండేవాడు కాదని గుర్తుచేస్తున్నారు.
undefined
మొదటి ఐదు మ్యాచుల్లో కేవలం 22 పరుగులే చేసినా సౌరవ్ గంగూలీ వరుసగా అవకాశాలు ఇవ్వడం వల్లే, ధోనీ లాంటి బ్యాట్స్‌మెన్ ప్రపంచానికి తెలిశాడని మాహీ గుర్తుంచుకోవాలని అంటున్నారు.
undefined
అదీ కాకుండా సీనియర్లు అయినా డుప్లిసిస్, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్ ధోనీ వంటి వాళ్లు కూడా పెద్దగా స్కోర్లు చేయలేకపోయారనే విషయం గుర్తుంచుకోవాలని అంటున్నారు.
undefined
ఓ వైపు వికెట్లు పడుతున్నా, అద్భుత హాఫ్ సెంచరీతో చెన్నై సూపర్ కింగ్స్ పరువు కాపాడిన సామ్ కుర్రాన్ వయసు కూడా కేవలం 22 ఏళ్లేనని గుర్తు చేస్తున్నారు.
undefined
ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది కాబట్టి... మిగిలిన మ్యాచుల్లో కూడా యంగ్ ప్లేయర్లకి అవకాశాలు ఇవ్వాలని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. దీని వల్ల యంగ్ స్టార్లకు రాణించే అవకాశం దొరుకుతుందని అంటున్నారు.
undefined
click me!