IPL 2020: జాదవ్, మ్యాక్స్‌వెల్, కార్తీక్... ఐపీఎల్‌లో చెత్త రికార్డు...

First Published Oct 9, 2020, 5:21 PM IST

ఐపీఎల్‌ 2020 సీజన్‌లో దాదాపు అన్ని జట్లు ఆరేసి మ్యాచులు ఆడేశాయి. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ కోసం క్రికెటర్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. బౌలర్లు కూడా సిక్సర్లు బాదిన ఈ సీజన్‌లో భారీ హిట్టర్లుగా పేరొందిన కొందరు బ్యాట్స్‌మెన్ మాత్రం ఇప్పటిదాకా సిక్సర్ బాదలేకపోయారు. వాళ్లు ఎవ్వరంటే..

కేదార్ జాదవ్: ఐపీఎల్‌ 2020లో నాలుగు మ్యాచుల్లో బ్యాటింగ్ చేసిన కేదార్ జాదవ్... ఇప్పటిదాకా 59 బంతులను ఎదుర్కొన్నాడు. అంటే దాదాపు 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన కేదార్ జాదవ్.. ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు.
undefined
గ్లెన్ మ్యాక్స్‌వెల్: భారీ హిట్టింగ్ చేయగల మోస్ట్ డేంజరస్ బ్యాట్స్‌మెన్ మ్యాక్స్‌వెల్... ఇప్పటిదాకా 56 బంతులు ఫేస్ చేశాడు. అయితే ఒక్క భారీ సిక్సర్ కూడా బాదలేకపోయాడు మ్యాక్స్‌వెల్.
undefined
దినేశ్ కార్తీక్: కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్, ఈ సీజన్‌లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటిదాకా సరైన ఇన్నింగ్స్ ఆడలేకపోయిన దినేశ్ కార్తీక్... 48 బంతులు ఎదుర్కొన్నాడు. కానీ ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు.
undefined
మురళీ విజయ్: చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ మురళీ విజయ్ తేలిగ్గా భారీ షాట్లు ఆడగలడు. అయితే ఈ సీజన్‌లో విజయ్ నుంచి సరైన ఇన్నింగ్స్ ఇప్పటిదాకా రాలేదు. 43 బంతులు ఎదుర్కొన్న మురళీ విజయ్... ఒక్క సిక్స్ కూడా బాదలేకపోయాడు.
undefined
రాబిన్ ఊతప్ప: కోల్‌కత్తా నుంచి రాజస్థాన్ రాయల్స్‌ జట్టులోకి వచ్చిన రాబిన్ ఊతప్ప... ఈ సీజన్‌లో వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. నాలుగు మ్యాచులు ఆడిన రాబిన్ ఊతప్ప... 42 బంతులు ఎదుర్కొన్నాడు. కానీ ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు ఊతప్ప.
undefined
రియాన్ పరాగ్: రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున 4 మ్యాచులు ఆడిన రియాన్... ఇప్పటిదాకా సరైన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 4 మ్యాచుల్లో 30 బంతులు ఎదుర్కొని 23 పరుగులు చేసిన రియాన్ పరాగ్, ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు.
undefined
click me!