IPL 2020: ప్రభుత్వ ఉద్యోగుల్ని అవమానిస్తారా... వీరూపై ట్రోలింగ్...

First Published Oct 9, 2020, 4:11 PM IST

IPL 2020 సీజన్ 13లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు. ‘మిస్టర్ ఐపిఎల్’ సురేశ్ రైనా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్న ధోనీ సేన... ఆరు మ్యాచుల్లో నాలుగింట్లో ఓడింది. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందించిన సంగతి తెలిసిందే.

చెన్నై ఆటతీరుపై స్పందించిన వీరేంద్ర సెహ్వగ్... సీఎస్‌కే ఆటగాళ్లను ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చారు.
undefined
కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 168 పరుగుల సులువైన లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది చెన్నై సూపర్ కింగ్స్...
undefined
ఆడినా ఆడకపోయినా జీతం వస్తుందన్నట్టుగా చెన్నై ఆటగాళ్లు ఆడుతున్నారని సెటైర్లు వేశాడు వీరేంద్ర సెహ్వాగ్...
undefined
12 బంతుల్లో 7 పరుగులు చేసిన కేదార్ జాదవ్‌ను కూడా ఓ ఆటాడుకున్నాడు వీరేంద్ర సెహ్వాగ్...
undefined
మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చే క్రికెటర్ అవసరానికి తగ్గట్టుగా గేర్ మార్చి ఆడాల్సి ఉంటుంది...
undefined
కానీ జాదవ్ ఏ మాత్రం జట్టుకు ఉపయోగపడడం లేదని... కేవలం ఓ అనవసరమైన డెకరేషన్‌లా మారడని చెప్పాడు వీరేంద్ర సెహ్వాగ్.
undefined
కేదార్ జాదవ్ ఆటతీరుపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి... అయితే వీరూ ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చడంతో వివాదం రేగింది.
undefined
పని చేసినా, చేయకున్నా జీతం తీసుకుంటామని ప్రభుత్వ ఉద్యోగులను వీరూ విమర్శించారనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సర్కార్ జాబ్ హోల్డర్లు...
undefined
ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగులను చులకన చేస్తూ మాట్లాడుతున్నారని, వీరూ లాంటి క్రికెటర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
undefined
వీరేంద్ర సెహ్వాగ్ వెంటనే ప్రభుత్వ ఉద్యోగులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
undefined
click me!