అంతా కలిసి ఫెయిల్ అయ్యారు! అతన్ని ఒక్కడినే అనడం కరెక్ట్ కాదు... బాబర్ ఆజమ్‌కి మిస్బా వుల్ హక్ సపోర్ట్...

First Published | Sep 21, 2023, 1:30 PM IST

ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో ఫైనల్ చేరిన పాకిస్తాన్, ఆసియా కప్ 2023 టోర్నీలో మాత్రం సూపర్ 4 స్టేజీ నుంచే నిష్కమించింది. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన పాకిస్తాన్, శ్రీలంకతో మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది..
 

శ్రీలంకతో సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్తాన్ టాపార్డర్ ఫెయిల్ అయినా మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్ కారణంగా 252 పరుగుల భారీ స్కోరు చేసింది పాకిస్తాన్. 42 ఓవర్లలో ఈ లక్ష్య ఛేదనలో ఒకానొక దశలో ఈజీగా గెలిచేలా కనిపించిన శ్రీలంక, డెత్ ఓవర్లలో తడబడి వరుస వికెట్లు కోల్పోయింది..

శ్రీలంక విజయానికి ఆఖరి ఓవర్ ఆఖరి 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సి వచ్చాయి. చరిత్ అసలంక వరుసగా 4, 2 బాది, శ్రీలంకకు ఘన విజయాన్ని అందించాడు. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్, సూపర్ 4 స్టేజీలో ఆఖరి స్థానంలో నిలిచింది..

Latest Videos


‘పాకిస్తాన్ ఓటమికి బాబర్ ఆజమ్‌, ఒక్కడినే బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇండియా, శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో మిగిలిన ప్లేయర్లు ఎవ్వరూ కూడా సరిగ్గా ఆడలేకపోయారు. పాక్ ఓటమిలో వారికి కూడా భాగం ఉంది..

Shaheen Shah Afridi-Babar Azam

ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్ ఆడిన తీరు చూస్తుంటే, కావాలని ఓడిపోయినట్టు అనిపించింది. అయితే వన్డే వరల్డ్ కప్‌లో పాక్ బాగా ఆడుతుందని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే జింబాబ్వేతో మ్యాచ్ ఓడిన తర్వాత కూడా పాక్, టీ20 వరల్డ్ కప్ 2022లో ఫైనల్‌ చేరింది...

కేవలం భారత పరిస్థితులకు అలవాటు పడితే చాలు, ఈజీగా మ్యాచులు గెలవవచ్చు. వేల సంఖ్యలో స్టేడియాలకు వచ్చే భారత క్రికెట్ ఫ్యాన్స్ నుంచే పాకిస్తాన్ వ్యతిరేకత ఎదుర్కోవచ్చు. దేనికైనా సిద్ధపడి, మ్యాచులు ఆడేందుకు వెళ్లాలి...

నా వరకూ వన్డే వరల్డ్ కప్‌కి ప్రకటించిన జట్టు కరెక్టుగానే ఉంది. మెగా ఈవెంట్ గెలవడానికి ఎలాంటి ప్లేయర్లు కావాలో, వాళ్లకే ప్రపంచ కప్ టీమ్‌లో చోటు దక్కింది.

Babar Azam bowled

అయితే ప్రతీసారి బాబర్ ఆజమ్ ఒక్కడే ఆడాలని ఎదురుచూడడం కరెక్ట్ కాదు.. టీమ్ అంతా కలిసి ఆడితేనే ప్రపంచ కప్ గెలవగలం..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్..  

click me!