టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌తో టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ, వచ్చే నెలలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ ద్వారా వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా అందుకోబోతున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు రోహిత్ శర్మ...
‘విరాట్ కోహ్లీ, తన కెప్టెన్సీతో భారత జట్టును వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా తయారుచేశాడు. ఈ ఐదేళ్లు జట్టును ముందుండి నడిపించాడు...
210
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కారణంగానే భారత జట్టు ఇప్పుడు ఇంత పటిష్టంగా తయారైంది. విరాట్ ప్రతీ గేమ్‌ను గెలవాలని ఎంతో కసిగా, పట్టుదలగా ఉండేవాడు...
310
జట్టులోని ప్రతి ఒక్కరిలోనూ అదే పట్టుదల కనిపించేది. వారి రోల్స్ గురించి స్పష్టమైన క్లారిటీ, అవగాహన ఉండేవి. విరాట్ కెప్టెన్సీలో ఆడడంలో ఓ కిక్ ఉండేది... ముఖ్యంగా నేను, విరాట్ కెప్టెన్సీలోనే ఎక్కువ క్రికెట్ ఆడాను...
410
తన కెప్టెన్సీలో ఆడిన ప్రతీ మూమెంట్‌ను ఎంతో ఎంజాయ్ చేశాడు. నేను కూడా విరాట్ చేసిన దాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తా. భారత జట్టును మరింత పటిష్టం చేయాల్సిన అవసరం చాలా ఉంది...
510
జట్టుగా పటిష్టమవుతూనే, ప్లేయర్లను కూడా మరింత మెరుగుపరచాలి. నేను అనుకునేది అదే, భారత జట్టు ఎప్పుడూ లేనంత మెరుగ్గా రాణించాలి...
610
నాకు ఈ అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నా. ఇది అద్భుత అవకాశం మాత్రమే కాదు, చాలా పెద్ద బాధ్యత కూడా. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌గా ఎంపికకావడం చాలా సంతోషాన్నిచ్చింది...
710
భారత జట్టును విజయపథంలో నడిపించడానికి ఎదురుచూస్తున్నా. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నిరూపించుకుంటూనే ఉన్నా. నా వరకూ విన్నింగ్ ఫార్ములా ఒకటే...
810
ప్లేయర్ల మధ్య ఎలాంటి అంతరాలు ఉండకూడదు. వారి పాత్ర ఏంటో ప్రతీ ఒక్కరికీ స్పష్టమైన అవగాహన ఉండాలి. అప్పుడే వాళ్లేం చేయాలనే విషయంలో ఎలాంటి కంఫ్యూజన్ ఉండదు...
910
కెప్టెన్‌తో పాటు హెడ్ కోచ్ కూడా జట్టుకి చాలా కీలకం. మేమిద్దం ఈ విషయంపైనే దృష్టి పెడుతున్నాం. జట్టుకి ఎంపికైన ప్రతీ ఒక్క ప్లేయర్‌కి ఏం చేయాలనే విషయంలో స్పష్టత ఇస్తేనే చాలని అనుకుంటున్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ...
1010
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా ఉన్న రోహిత్ శర్మ, ఇప్పటికే 32 మ్యాచుల్లో భారత జట్టుకి తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు...